2 crore salary package: రెండు కోట్ల ప్యాకేజీతో అదరగొట్టిన హైదరాబాదీ అమ్మాయి
హైదరాబాద్‌కు చెందిన ఎన్.దీప్తి తండ్రి పోలీస్ కమిషనరేట్ ఫోరెన్సిక్ విభాగంలో పనిచేస్తున్నారు. ఉస్మానియా ఇంజినీరింగ్ కాలేజీలో ఆమె బీటెక్ కంప్లీట్ చేసింది.
చదవండి: మూడు కోట్ల ప్యాకేజీతో గోల్డెన్ చాన్స్ కొట్టిన బీటెక్ విద్యార్థి
జేపీ మోర్గాన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా తన కెరియర్‌ను ప్రారంభించింది దీప్తి. కోడింగ్ మీద మంచి పట్టు సాధించింది. కోడింగ్ అంటే ఇష్టంతోనే తాను సాఫ్ట్‌వేర్ సైడ్ వచ్చినట్లు చెబుతుంది. అలాగే రోజువారీ సమస్యలను పరిష్కరించడంలో టెక్నాలజీ ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఆమె చెబుతుంది. ప్రజల జీవితాలను మార్చడంలో సాంకేతిక పరిజ్ఞానం గణనీయమైన ప్రభావాన్ని చూపుతోందని ఆమె అభిప్రాయం.
☛ Top 10 Highest paying Govt Jobs: అత్యధిక వేతనం ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవే
జేపీ మోర్గాన్‌లో జాబ్ వదిలేసి కంప్యూటర్స్‌లో ఎంఎస్ చేసేందుకు ఆమె ఫ్లోరిడా వెళ్లారు. ఫ్లోరిడా యూనివరసిటీలో 2021లో ఎంఎస్ పూర్తి చేసిన తర్వాత నిర్వహించిన తర్వాత అక్కడ నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో ఆమె అదరగొట్టారు. దీప్తి కోసం టాప్ కంపెనీలన్నీ తీవ్రంగా పోటీపడ్డాయి. గోల్డ్‌మాన్ సాచ్స్, అమెజాన్ కంపెనీలు భారీ వేతనాన్ని ఆఫర్ చేశాయి. చివరికి రెండు కోట్ల ప్యాకేజీతో ఆమెను మైక్రోసాఫ్ట్ దక్కించుకుంది.
☛ 88 Lakh salary package: అదరగొట్టిన వరంగల్ నిట్ విద్యార్థి.... 88 లక్షల ప్యాకేజీతో రికార్డు
ఫ్లోరిడా యూనివర్సిటీలో 2021లో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో మైక్రోసాఫ్ట్ దాదాపు 300 మందికి ఆఫర్ లెటర్లు అందజేసింది. వీరిలో దీప్తి టాప్‌లో నిలిచింది. మన తెలుగమ్మాయి భారీ ప్యాకేజీ దక్కించుకోవడం మనకు గర్వకారణమే కదా..!
☛ 2 crore job offer from Uber: సాధారణ రైతు బిడ్డ... రూ.2 కోట్ల ప్యాకేజీతో అదరగొట్టాడు