Skip to main content

2 crore job offer from Uber: సాధార‌ణ రైతు బిడ్డ‌... రూ.2 కోట్ల ప్యాకేజీతో అద‌ర‌గొట్టాడు

ఒక సాధార‌ణ మ‌ధ్య‌త‌ర‌గ‌తి రైతు బిడ్డ క్యాంప‌స్ ప్లేస్‌మెంట్స్‌లో అద‌రగొట్టాడు. రూ.2.04 కోట్ల ప్యాకేజీ సొంతం చేసుకుని శ‌భాష్ అనిపించుకుంటున్నాడు. అత‌నికి ఈ ప్యాకేజీ అంత ఈజీగా అంద‌లేదు. ఎంతో క‌ష్ట‌ప‌డితే గానీ, ఐఐటీలో సీటు రాలేదు. అంత‌కంటే ఎక్కువ క‌ష్టప‌డి ఈ ప్యాకేజీ అందుకున్నాడు. అత‌డు ఈ స్థాయికి ఎలా చేరుకున్నాడో ఇక్క‌డ తెలుసుకుందాం..!
Rohit Negi
Rohit Negi

ఉత్త‌రాఖండ్ లోని కొట్‌ద్వార్‌ (Kotdwar) ప్రాంతానికి చెందిన ఓ సాధార‌ణ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన రైతు ఇంట్లో రోహిత్ నేగి(Rohit Negi) జ‌న్మించారు. రోహిత్‌కు ఓ సోద‌రి ఆమె న‌ర్సుగా ప‌ని చేస్తోంది. త‌ల్లి ఇంటిప‌ట్టున ఉంటూ పిల్ల‌ల‌ను చూసుకునేది. ఎంతో క‌ష్ట‌ప‌డితే కానీ, ఆ కుటుంబానికి నెల‌కు రూ.10 వేల ఆదాయం వ‌చ్చేది కాదు.

చ‌ద‌వండి: రెండు కోట్ల ప్యాకేజీతో అద‌ర‌గొట్టిన హైద‌రాబాదీ అమ్మాయి

Rohit Negi

రోహిత్ కూడా చ‌దువుల్లో సాధార‌ణ విద్యార్థిగానే ఉండేవాడు. పదో త‌ర‌గ‌తిలో 7.6 సీజీపీఏ  (7.6 CGPA) మాత్ర‌మే సాధించాడు. త‌ర్వాత ఇంట‌ర్‌లో 82.4 % మార్కుల‌తో ఉత్తీర్ణ‌త సాధించాడు. ఇక త‌న గురి ఐఐటీపై పెట్టాడు. ఇందుకోసం జేఈఈ కోసం స‌న్న‌ద్ధ‌మ‌వ్వ‌డం మొద‌లు పెట్టాడు. కానీ, విజ‌యం అంత ఈజీగా ద‌క్క‌లేదు. మొద‌టి సారి అస‌లు ర్యాంకే రాలేదు. దీంతో ఏడాది పాటు అక‌డ‌మిక్ కెరియ‌ర్ గ్యాప్ ఇచ్చి లాంగ్ ట‌ర్మ్ కోచింగ్ తీసుకున్నాడు.

చ‌ద‌వండి: 600కు 600 మార్కులు.. ఓ బాలిక రికార్డ్ సృష్టించిందిలా..

IIT Gowhati

జేఈఈలో ర్యాంక్ కొట్ట‌డం అంత ఈజీ కాదు క‌దా. రోహిత్‌కు ఈ విష‌యం త్వ‌ర‌గానే అర్థ‌మైంది. ఏడాది పాటు శిక్ష‌ణ తీసుకున్నా కూడా జేఈఈలో మంచి ర్యాంకు రాలేదు. కానీ, ఎక్క‌డా నిరాశ‌కు లోన‌వ‌లేదు. ఉత్త‌రాఖండ్‌లోనే ఓ ఇంజ‌నీరింగ్ కాలేజీలో బీటెక్ చేరాడు. అది ఎలాగోలా కంప్లీట్ చేశాడు. ఆ కాలేజీకి కూడా క్యాంప‌స్ ప్లేస్‌మెంట్స్ వ‌చ్చాయి. కానీ రూ.3.5 ల‌క్ష‌ల వార్షిక వేత‌నం కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇచ్చేందుకు ఏ ఒక్క కంపెనీ ముందుకు రాలేదు.

చ‌ద‌వండి: ఐటీ హ‌బ్‌గా వైజాగ్‌... రెండు నెల‌ల్లో 2 వేల ఉద్యోగాలు

ఇలా కాదనుకుని, మ‌ళ్లీ త‌న ల‌క్ష్యం ఐఐటీ వైపు అడుగులు వేశాడు. ఈసారి ప‌క్కా వ్యూహంతో చ‌దివి గేట్‌లో ర్యాంక్ సాధించాడు. 2020లో దాదాపు ల‌క్ష మంది గేట్ ఎగ్జామ్ రాస్తే రోహిత్‌కు 202 ర్యాంక్ వ‌చ్చింది. ర్యాంక్‌తో పాటు ఐఐటీ గౌహ‌తిలో సీటు కూడా వ‌చ్చింది. అక్క‌డ ఎంటెక్ లో జాయిన్ అయ్యి 8.44 సీజీపీఏ తో ఉత్తీర్ణ‌త సాధించాడు. చివరి ఏడాది నిర్వ‌హించిన క్యాంప‌స్ ప్లేస్‌మెంట్స్‌లో అంత‌ర్జాతీయ కంపెనీల‌న్నీ పాల్గొన్నాయి. ఉబ‌ర్ నిర్వ‌హించిన మూడు రౌండ్ల ఇంట‌ర్వ్యూలో రోహిత్ అన్ని రౌండ్ల‌లోనూ స‌త్తా చాటి చివ‌రికి రూ.2.04 కోట్ల ప్యాకేజీ ద‌క్కించుకున్నాడు.

IIT Gowhati

తాను ఈ ప్యాకేజీ ద‌క్కించుకోవ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని చెబుతాడు రోహిత్‌. బీటెక్ పూర్తి చేసిన త‌ర్వాత విప్రో ఆఫ‌ర్ చేసిన రూ.3 ల‌క్ష‌ల ప్యాకేజీకి ఓకే చెప్పి ఉంటే తాను ఈ స్థాయికి చేరుకునే వాడిని కాదంటున్నాడు ఈ ఐఐటీ విద్యార్థి. జీవితంలో అవ‌కాశాలు చాలా వ‌స్తాయ‌ని, వాటిని అందుకునే వ‌ర‌కు మ‌న‌కు ఓపిక ఉండాల‌ని రోహిత్ చెబుతాడు. తాను ప‌ది వ‌ర‌కు చాలా సాధార‌ణ విద్యార్థినేన‌ని, ఆ త‌ర్వాత క‌ష్ట‌ప‌డి చ‌ద‌వ‌డంతోనే ఈ స్థాయికి చేరుకున్న‌ట్లు చెబుతాడు. 

చ‌ద‌వండి: మూడు కోట్ల ప్యాకేజీతో గోల్డెన్ చాన్స్ కొట్టిన బీటెక్ విద్యార్థి

uber

కాబ‌ట్టి, మ‌నం కూడా ఏ ఒక్క ద‌శ‌లోనూ నిరాశ‌కు గురికాన‌వ‌స‌రం లేదని రోహిత్ సక్సెస్ జ‌ర్నీ చెబుతోంది. రోహిత్ వ‌య‌సు ఇప్పుడు కేవ‌లం 22 ఏళ్లు మాత్ర‌మే. రోహిత్ ఓ ఏడాది పాటు ఇండియాలోని ఉబ‌ర్ కంపెనీలో విధులు నిర్వ‌హించిన త‌ర్వాత అంత‌ర్జాతీయ కార్యాల‌యానికి మారే అవ‌కాశం ఉంది. రోహిత్ సాధించిన విజ‌యాన్ని అత‌డి కుటుంబ‌మే కాదు, దేశ‌మంతా గ‌ర్వంగా చెప్పుకుంటోంది.

Published date : 11 May 2023 01:46PM

Photo Stories