IT Companies in Vizag | ఐటీ హబ్‌గా వైజాగ్... రెండు నెలల్లో 2 వేల ఉద్యోగాలు

త్వరలో కార్యకలాపాలు ప్రారంభించనున్న ఇన్ఫోసిస్‌తో పాటు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిన కేంద్ర రక్షణ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ (బీఈఎల్) సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సెంటర్, అమెజాన్ డెవలప్‌మెంట్ సెంటర్, రాండ్‌శాండ్, టెక్నోటాస్క్, భారీగా విస్తరిస్తున్న టెక్ మహీంద్రా, డబ్ల్యూఏఎన్‌ఎస్ వంటి కంపెనీలు పెద్ద ఎత్తున నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం ఎదురుచూస్తున్నాయి.
చదవండి: మూడు కోట్ల ప్యాకేజీతో గోల్డెన్ చాన్స్ కొట్టిన బీటెక్ విద్యార్థి
విశాఖలో ఉన్న ఐటీ కంపెనీలకు వచ్చే రెండు నెలల్లో కనీసం రెండు వేల మంది ఐటీ నిపుణులు అవసరమవుతారని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(ఐటాప్) అంచనా వేసింది.

విశాఖలోని ఐటీ కంపెనీలకు అవసరమైన మానవ వనరులను ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ద్వారా శిక్షణ ఇచ్చి, శిక్షణ పూర్తికాగానే ఉపాధి కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఇందుకోసం రెండు నెలల్లో కనీసం రెండు వేల మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.

చదవండి: 65 లక్షల ప్యాకేజీతో అదరగొట్టిన ఎంబీఏ అమ్మాయి... అత్యధిక వేతనంతో రికార్డు
గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో పలు ఐటీ కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ముందుకువచ్చాయని, ఈ పెట్టుబడులను తక్షణం వాస్తవ రూపంలోకి తీసుకురావడంతో పాటు ప్రస్తుత ఐటీ కంపెనీల అవసరాలను తీర్చడంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే అదానీ డేటా సెంటర్ పనులు ప్రారంభించగా, త్వరలో మిగిలిన కంపెనీలు కూడా ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.