Skip to main content

Jobs In Tata Company: ‘పది’ పాసైన మహిళలకు ‘టాటా’లో ఉద్యోగం..

Jobs In Tata Company  Tata Group recruitment drive for women technicians  National Apprenticeship Promotion Scheme

టాటా గ్రూప్ 4000 మంది మహిళా సాంకేతిక నిపుణులను నియమించుకుంటామని ప్రకటించింది. తమిళనాడు, కర్ణాటకలోని కంపెనీ ఉత్పత్తుల విడిభాగాల తయారీ, అసెంబ్లీ ప్లాంట్లలో పనిచేయడానికి ఉత్తరాఖండ్‌కు చెందిన మహిళలకు రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు స్పష్టం చేసింది.

నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (ఎన్‌ఏటీఎస్‌), నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ (ఎన్‌ఏపీఎస్‌) ఆధ్వర్యంలో రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ నిర్వహిస్తామని టాటా గ్రూప్‌ తెలిపింది. ఈ మేరకు రిక్రూట్‌మెంట్ ప్రక్రియ గురించి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రణాళిక విభాగానికి తెలియజేసింది.

MBBS Seats In Andhra Pradesh: ఎంబీబీఎస్‌ సీటుకు ఫుల్‌ డిమాండ్‌.. భారీగా పెరిగిన కటాఫ్‌

రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ముఖ్యమంత్రి పుష్కర్ ధామి నేతృత్వంలో ఈ చర్యలు చేపడుతున్నట్లు టాటా గ్రూప్‌ పేర్కొంది. ఈ డ్రైవ్‌లో ఎంపికయ్యే మహిళలు తమిళనాడు, కర్ణాటకలోని కంపెనీ ప్లాంట్లలో పనిచేయాల్సి ఉంటుందని చెప్పింది. తమిళనాడులోని హోసూర్, కర్ణాటకలోని కోలార్‌ ప్లాంట్లపై టాటా ప్రత్యేకంగా దృష్టి సారించింది.

ఎన్‌ఏపీఎస్‌లో దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులు 10 లేదా 12వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి. 10, 12వ తరగతి లేదా ఐటీఐ డిప్లొమా ఉత్తీర్ణత సాధించినవారు ఎన్‌ఏటీఎస్‌కు అర్హులని కంపెనీ తెలిపింది. ఎంపిక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన వారిని షాప్ ఫ్లోర్ టెక్నీషియన్లుగా నియమిస్తారు.

35000 Government Jobs News: నిరుద్యోగుల‌కు భారీ Good News..మరో 35 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష‌న్‌

నిర్ణీత వేతనంతో పాటు అభ్యర్థులకు వసతి, ఆహారం, రవాణా సౌకర్యాలను అందిస్తామని టాటా గ్రూప్‌ ప్రకటించింది. ఇదిలాఉండగా, త్వరలో కంపెనీలో చేరబోయే నాలుగు వేలమంది మహిళలతో టాటా ఉత్పాదకత పెరుగుతుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో రానున్న రోజుల్లో ఉత్పత్తులు పెరిగి మార్కెట్‌ డిమాండ్‌ తీరుతుంది. ఫలితంగా కంపెనీ రెవెన్యూ అధికమవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 
 

Published date : 27 Aug 2024 12:58PM

Photo Stories