Skip to main content

6 crore salary package: ఇది క‌దా స‌క్సెస్ అంటే... రోజుకు 1.6 ల‌క్ష‌లు.. ఏడాదికి 6 కోట్ల ప్యాకేజీతో అద‌ర‌గొట్టిన కుర్రాడు

ఉన్న‌త విద్య పూర్తి చేసిన త‌ర్వాత కూడా అనేక మంది విద్యార్థులు ఖాళీగా ఉంటున్నారు. కోచింగ్ సెంట‌ర్ల వ‌ద్ద తిరుగుతూ ఉద్యోగాల కోసం పడిగాపులుకాస్తున్నారు. కానీ, ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళితే విజ‌యం వెతుక్కుంటూ వ‌స్తుందంటున్నాడు రాజస్థాన్‌కు చెందిన ఓ యువ‌కుడు.
Rachit Agarwal
Rachit Agarwal

చ‌దువు అయిపోగానే ఏడాదికి రూ.6 కోట్ల ప్యాకేజీ సొంతం చేసుకుని శ‌భాష్ అనిపించాడు. ఆ వివ‌రాలేంటో ఇక్క‌డ చూద్దాం.!

➤☛  మూడు కోట్ల ప్యాకేజీతో గోల్డెన్ చాన్స్ కొట్టిన బీటెక్ విద్యార్థి

రాజ‌స్థాన్ లోని కోటా న‌గ‌ర ప‌రిధిలోని శ‌క్తిన‌గ‌ర్‌కు చెందిన వ్యాపార‌వేత్త రాజేష్ అగ‌ర్వాల్‌, సంగీతా అగ‌ర్వాల్ దంప‌తుల కుమారుడు ర‌చిత్ అగ‌ర్వాల్‌. రాజేష్ అగ‌ర్వాల్ స్థానికంగా ఫుడ్ ప్యాకేజీ సంస్థ‌ను న‌డిపిస్తున్నాడు. త‌ల్లి ఇంటి ప‌ట్టునే ఉంటుంది. చిన్న‌నాటి నుంచి చ‌దువులో ఎప్పుడూ ముందుడే వాడు ర‌చిత్‌. భ‌విష్య‌త్‌పై పూర్తి అవ‌గాహ‌న‌తో అడుగులు వేసేవాడు.

Rachit Agarwal

పాఠ‌శాల విద్యాభ్యాసం పూర్త‌వ‌గానే యూఎస్‌లో ఉన్న‌త విద్యాభ్యాసం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. యూఎస్ కాలేజీల్లో ప్ర‌వేశానికి అవ‌స‌ర‌మైన స్కాల‌స్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌(Scholastic Aptitude Test) రాసి ఉత్తీర్ణ‌త సాధించాడు. అంతేకాదు రూ.2కోట్ల స్కాల‌ర్‌షిప్ కూడా ద‌క్కించుకున్నాడు. ఈ డ‌బ్బుతో  ఆర్లింగ్టన్(Arlington) లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో చేరాడు. అక్క‌డే కంప్యూటర్ సైన్స్ తో పాటు ఫిలాసఫీ, ఎకనామిక్స్ ను పూర్తి చేశాడు. 

➤☛ రెండు కోట్ల ప్యాకేజీతో అద‌ర‌గొట్టిన హైద‌రాబాదీ అమ్మాయి

Rachit Agarwal


 
పాఠశాలలో చ‌దువుకునే వ‌య‌సులోనే ర‌చిత్ కోడింగ్‌పై ప‌ట్టు సాధించాడు. స్థానికంగా నిర్వ‌హించే కోడింగ్ పోటీల్లో పాల్గొని స‌త్తా చాటేవాడు. ఆ అనుభ‌వంతో ఇంజినీరింగ్ చ‌దువుకునే సమ‌యంలోనే మూడు స్టార్ట‌ప్‌ల‌ను ప్రారంభించాడు. వీటికి అవ‌స‌ర‌మైన‌ నిధుల కోసం పాటుపడుతూనే, క్రిప్టో కంపెనీల్లో ఐదేళ్ల ఇంటర్న్ షిప్ కూడా పూర్తి చేసేశాడు. 2022 మేలో రచిత్ త‌న విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడు.

Rachit Agarwal

☛ 2 crore job offer : సాధార‌ణ రైతు బిడ్డ‌... రూ.2 కోట్ల ప్యాకేజీతో అద‌ర‌గొట్టాడు

రచిత్ త‌న చదువు పూర్తవ‌గానే పలు కంపెనీల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ సమయంలో అతనికి అనేక ఉద్యోగ ఆఫర్లు వచ్చాయి. అమెరికాకు చెందిన ఓ దిగ్గ‌జ కంపెనీ రూ. 6 కోట్ల ఆఫ‌ర్ చేసింది. ఈ ప్యాకేజీలో భాగంగా రచిత్ కు రోజుకు లక్షా 66 వేల రూపాయలు, నెలకు రూ.50 లక్షలు అందుతున్నాయి. రచిత్ అగర్వాల్ ప్రస్తుతం అమెరికాలోని అమెజాన్‌ సంస్థలో సాఫ్ట్ వేర్ కోడింగ్ టీమ్ లో ఉద్యోగం చేస్తున్నాడు.

Published date : 17 May 2023 05:37PM

Photo Stories