Skip to main content

Campus Placements: రూ.9 లక్షల ప్యాకేజీతో విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్‌.. ఎస్‌ఆర్‌ఐటీ విద్యార్థుల ప్రతిభ

బుక్కరాయసముద్రం: గ్లోబల్‌ ఐటీ కంపెనీ టీసీఎస్‌ ఇటీవల నిర్వహించిన క్యాంపస్‌ డ్రైవ్‌లో ఎస్‌ఆర్‌ఐటీ (అటానమస్‌) ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. బీకేఎస్‌ మండలం రోటరీపురం వద్ద ఉన్న ఆ కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఎస్‌ఆర్‌ఐటీ కరస్పాండెంట్‌ ఆలూరి సాంబశివారెడ్డి వెల్లడించారు.
Campus Placements
Campus Placements Campus Drive For Engineering students

టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌ (టీసీఎస్‌) ఇటీవల నిర్వహించిన ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌లో తమ కళాశాలకు చెందిన 138 మంది విద్యార్థులకు ఉద్యోగాలు దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు.

APEAP SET Counseling Schedule Released: ఈఏపీసెట్‌–2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. పూర్తి వివరాలివే!

వీరిలో ఇద్దరికి ప్రైమ్‌ ఆఫర్‌తో ఏడాదికి రూ.9 లక్షల ప్యాకేజీ దక్కిందన్నారు. 21 మందికి ఏడాదికి రూ.7లక్షలు, 115 మంది రూ.3 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. తమ కళాశాలలోని అన్ని బ్రాంచ్‌లకు చెందిన విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికవ్వడం చాలా గర్వంగా ఉందన్నారు.

campus placements

How to Overcome Exam Stress: పరీక్షల ఒత్తిడి.. ఈ టిప్స్‌ ఫాలో అయితే బెస్ట్‌

వీరిలో చాలా మంది ప్రభుత్వం అందించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదువుకున్న వారే ఉన్నారన్నారు. తమ కళాశాలలో ప్రతి విద్యార్థికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో యాజమాన్యం పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బాలకృష్ణ, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రంజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 30 Nov 2024 11:01AM

Photo Stories