SSC CGL 2022 Notification: 20 వేల ఉద్యోగాలు.. ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానంతోపాటు ప్రిపరేషన్ గైడెన్స్..
బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులకు శుభవార్త! 20 వేల ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ).. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్(సీజీఎల్)ఎగ్జామినేషన్-2022 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని..గ్రూప్-బి, గ్రూప్-సి కేడర్స్‌లో.. 35 హోదాల్లో..పోస్ట్‌ల భర్తీకి శ్రీకారం చుట్టింది! ఈ నేపథ్యంలో.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా విడుదల చేసిన.. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ నోటిఫికేషన్ వివరాలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానంతోపాటు ప్రిపరేషన్ గైడెన్స్..
- 20 వేల పోస్ట్‌లతో సీజీఎల్‌ఈ నోటిఫికేషన్
- పలు శాఖల్లో గ్రూప్-బి, గ్రూప్-సి ఉద్యోగాలు
- బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో పోటీ పడే అవకాశం
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ).. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్-బి, గ్రూప్-సి, గ్రూప్-డి పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టే సంస్థ. ఏటా క్రమం తప్పకుండా నియామక ప్రక్రియలను చేపడుతున్న ఎస్‌ఎస్‌సీ.. తాజాగా గ్రూప్-బి, గ్రూప్-సి ఉద్యోగాల భర్తీకి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్-2022కు ప్రకటన విడుదల చేసింది.
20 వేల ఉద్యోగాలు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా విడుదల చేసిన సీజీఎల్‌ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల్లో 35 హోదాల్లో దాదాపు 20 వేల ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది. వీటిలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కం ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్, ఇన్‌స్పెక్టర్(ప్రివెంటివ్ ఆఫీసర్), ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్), అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్(గ్రూప్-బి), సీబీఐలో సబ్ ఇన్‌స్పెక్టర్(గ్రూప్-బి), కాగ్‌లో డివిజినల్ అకౌంటెంట్(గ్రూప్-బి) వంటి పోస్టులు ఉన్నాయి.
విద్యార్హతలు
- అన్ని ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్/ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్ట్‌లకు బ్యాచిలర్ డిగ్రీతోపాటు సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఏ, ఎంకాం, ఎంబీఏ(ఫైనాన్స్) లేదా బిజినెస్ ఎకనామిక్స్‌లో పీజీ ఉత్తీర్ణతను అదనపు అర్హతగా పేర్కొన్నారు.
- జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్‌లకు ఇంటర్మీడియెట్ స్థాయిలో మ్యాథమెటిక్స్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి.. ఆ తర్వాత బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసుకుని ఉండాలి. లేదా.. బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్‌గా చదివుండాలి.
- నిర్దిష్ట విద్యార్హతలను అక్టోబర్ 8, 2022లోపు పొంది ఉండాలి.
వయసు
దాదాపు అన్ని పోస్ట్‌లకు గరిష్ట వయో పరిమితిని 30 ఏళ్లుగా పేర్కొనగా.. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్‌లకు 32 ఏళ్లుగా, గ్రూప్-సి పోస్ట్‌లకు 18-27 ఏళ్లుగా నిర్దేశించారు. జనవరి1, 2022ను గరిష్ట వయో పరిమితికి కటాఫ్ తేదీగా పేర్కొన్నారు.
వేతన శ్రేణి ఇలా
- గ్రూప్-బి గెజిటెడ్ పోస్ట్‌లకు రూ.47,600-రూ. 1,51,100; గ్రూప్-బి నాన్ గెజిటెడ్ పోస్ట్‌లకు రూ.44,900-రూ.1,42,400; గ్రూప్-బిలోనే మరికొన్ని పోస్ట్‌లకు రూ.35,400- రూ. 1,12,400; గ్రూప్-సి పోస్ట్‌లకు రూ.29,200-రూ.92,300, అదే విధంగా రూ.25,500-రూ.81,100 వేతన శ్రేణిని పేర్కొంది.
రెండు దశల రాత పరీక్ష
- ఎస్‌ఎస్‌సీ నిర్వహించనున్న సీజీఎల్‌ఈ పరీక్ష టైర్-1, టైర్-2 పేరుతో రెండు దశలుగా ఉంటుంది.
టైర్-1 పరీక్ష
తొలి దశలో టెర్-1 పరీక్ష 100 ప్రశ్నలు-200 మార్కులకు జరుగుతుంది. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్(25 ప్రశ్నలు), జనరల్ అవేర్‌నెస్(25 ప్రశ్నలు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్(25 ప్రశ్నలు), ఇంగ్లిష్ కాంప్రహెన్షన్(25 ప్రశ్నలు) నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు కేటాయిస్తారు. పరీక్ష సమయం 1గంట.
టైర్-2లో నాలుగు పేపర్లు
- టైర్-1లో నిర్దిష్ట కటాఫ్ మార్కులు సాధించి.. మెరిట్ జాబితాలో నిలిచిన వారికి తదుపరి దశలో టైర్-2 పరీక్ష నిర్వహిస్తారు. టైర్-2 పరీక్ష మొత్తం నాలుగు పేపర్లలో జరుగుతుంది. వివరాలు..
- పేపర్-1: పేపర్-1ను సెషన్-1, సెషన్-2లుగా నిర్వహిస్తారు. అదే విధంగా ప్రతి సెషన్‌ను రెండు సెక్షన్‌లుగా పేర్కొన్నారు. సెషన్-1(సెక్షన్-1)లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్(మాడ్యూల్-1), రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్(మాడ్యూల్-2) విభాగాల నుంచి 30 ప్రశ్నలు చొప్పున మొత్తం 60 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు చొప్పున 180 మార్కులు ఉంటాయి. సెషన్-1 సెక్షన్-2లో.. మాడ్యూల్-1 పేరుతో ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్‌లో 45 ప్రశ్నలు, మాడ్యూల్-2 పేరిట జనరల్ అవేర్‌నెస్ విభాగాల్లో 25 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 70 ప్రశ్నలకు 210 మార్కులు ఉంటాయి. సెషన్-1 సెక్షన్-3లో మాడ్యూల్-1 పేరుతో కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 20 ప్రశ్నలతో 60 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
- సెషన్-2లో సెక్షన్-3 పేరుతో డేటాఎంట్రీ స్పీడ్ టెస్ట్‌ను (మాడ్యూల్-3) 15 నిమిషాల వ్యవధిలో నిర్వహిస్తారు.
- పేపర్-2ను స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్‌తో 100 ప్రశ్నలతో 200 మార్కులకు నిర్వహిస్తారు.
- పేపర్-3ని జనరల్ స్టడీస్(ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్)తో 200 మార్కులకు 100 ప్రశ్నలతో నిర్వహిస్తారు.
- అన్ని పోస్ట్‌ల అభ్యర్థులు పేపర్-1కు తప్పనిసరిగా హాజరు కావాలి.
- పేపర్-2ను జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్‌ల అభ్యర్థులకు మాత్రమే నిర్వహిస్తారు.
- పేపర్-3ని అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్ట్‌ల అభ్యర్థులకు నిర్వహిస్తారు.
చదవండి: SSC-Combined Graduate Level Exam 2022: 20,000 పోస్టులు...ఎంపిక విధానంలో మార్పులు
విజయం సాధించాలంటే
రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్
విశ్లేషణ నైపుణ్యాలను పరీక్షించే ఈ విభాగంలో రాణించాలంటే..కోడింగ్, డీ-కోడింగ్, అనలిటికల్ పజిల్స్, క్రిటికల్ రీజనింగ్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లిష్ అక్షర క్రమాన్ని ముందు నుంచి వెనుకకు, వెనుక నుంచి ముందుకు ప్రాక్టీస్ చేయాలి. దీంతోపాటు ఏ అక్షరం ఎన్నో స్థానంలో ఉందో సులువుగా గుర్తించాలి. అదేవిధంగా అనలిటికల్ రీజనింగ్, సిలాజిజమ్స్, ఇనీక్వాలిటీస్, ఇన్‌పుట్, అవుట్‌పుట్, డేటా సఫిషియెన్సీ విభాగాలపై పట్టు సాధించాలి.
జనరల్ అవేర్‌నెస్
జనరల్ అవేర్‌నెస్/జనరల్ స్టడీస్‌లో.. మంచి స్కోర్ కోసం హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, జీకే అంశాలపై పట్టు సాధించాలి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
అర్థమెటిక్‌కు సంబంధించి పర్సంటేజ్, యావరేజేస్, రేషియో-ప్రపోర్షన్, ప్రాఫిట్-లాస్, సింపుల్-కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్-వర్క్, టైమ్-డిస్టెన్స్, పర్ముటేషన్స్-కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, మిక్షర్ అండ్ అలిగేషన్స్, పార్టనర్ షిప్‌పై దృష్టిపెట్టాలి. భాగహారాలు, కూడికలు, తీసివేతలు వంటి ప్రాథమిక అంశాలను నోటితో గణించే విధంగా ప్రాక్టీస్ చేయాలి. సింప్లిఫికేషన్స్‌కు బోడ్‌మస్ రూల్స్‌కు సంబంధించి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. సంఖ్యల వర్గాలు, ఘనాలు గుర్తుంచుకోవాలి.
ఇంగ్లిష్ కాంప్రహెన్షన్
అభ్యర్థులు బేసిక్ గ్రామర్‌పై అవగాహన పెంచుకోవాలి. దీంతోపాటు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, రీడింగ్ కాంప్రహెన్షన్, యాంటానిమ్స్, సినానిమ్స్, స్పాటింగ్ ద ఎర్రర్స్. అదేవిధంగా స్పెల్లింగ్స్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, టెన్సెస్, ప్రిపోజిషన్స్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, వొకాబ్యులరీ, రీ రైటింగ్ ద సెంటెన్స్, సెంటెన్స్ రీ-అరేంజ్‌మెంట్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ప్రెసిస్ రైటింగ్, బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్‌పై పట్టు సాధించాలి. టెన్సెస్, సెంటెన్స్ ఫార్మేషన్, యాక్టివ్-ప్యాసివ్ వాయిస్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ వంటి ముఖ్యాంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి. రీడింగ్ కాంప్రహెన్షన్, వొకాబ్యుల రీల్లోనూ పూర్తి స్థాయిలో నైపుణ్యం పొందాలి.
డేటా ఇంటర్‌ప్రెటేషన్
టేబుల్స్, చార్ట్‌లు, గ్రాఫ్‌ల ద్వారా సమాచారమిస్తూ ప్రశ్నలు అడిగే డేటా ఇంటర్‌ప్రెటేషన్ ప్రశ్నలను సాధించాలంటే.. పర్సంటేజెస్, యావరేజెస్, రేషియోలలో అవగాహన ఉండాలి. వివిధ రకాల గ్రాఫ్‌లను సాధన చేయాలి. ఈ విభాగంలో పట్టు కోసం.. టేబుల్స్, బార్ చార్ట్స్, పై చార్ట్స్ మొదలైన వాటిని బాగా ప్రాక్టీస్ చేయాలి.
కంప్యూటర్ నాలెడ్జ్
ఈ విభాగంలో రాణించేందుకు కంప్యూటర్ ఫండమెంటల్స్, బేసిక్ కంప్యూటర్ స్ట్రక్చర్, ఆపరేటింగ్ సిస్టమ్, నెట్‌వర్క్, ఇంటర్నెట్, సాఫ్ట్‌వేర్ కాన్సెప్ట్స్, డీబీఎంస్, ఎంఎస్ ఆఫీస్‌లకు సంబంధించి బేసిక్ టెర్మినాలజీపై పట్టు సాధించాలి. సిస్టమ్‌కు సంబంధించి హార్డ్‌వేర్ టూల్స్, వాటి ఉపయెగాలు వంటి వాటిపైనా అవగాహన ఏర్పరచుకోవాలి.
పేపర్-2, పేపర్-3
జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్‌ల అభ్యర్థులకు నిర్వహించే పేపర్-2, అదే విధంగా.. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్ట్‌ల అభ్యర్థులకు నిర్వహించే పేపర్-3లలో రాణించేందుకు అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో అకడమిక్ పుస్తకాలను అభ్యసనం చేయాలి. అదే విధంగా గత ప్రశ్న పత్రాలు, నమూనా ప్రశ్న పత్రాలను సాధన చేయడం కూడా ఉపయుక్తంగా ఉంటుంది.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు చివరి తేదీ: అక్టోబర్ 8, 2022
- దరఖాస్తులో సవరణలు: అక్టోబర్ 12-అక్టోబర్ 13, 2022
- టైర్-1 పరీక్ష తేదీ: డిసెంబర్, 2022లో
- టైర్-2 పరీక్ష తేదీ: ఫిబ్రవరి, 2023లో నిర్వహించే అవకాశం
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://ssc.nic.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 08,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |