SSC Constable Notification 2023: 7,547 కానిస్టేబుల్ పోస్ట్‌లు.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి... జాబ్ కొట్టండి
- 7,547 కానిస్టేబుల్ పోస్ట్‌లకు ఎస్‌ఎస్‌సీ ప్రకటన
- ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు
- మూడంచెల్లో ఎంపిక విధానం
- వేతన శ్రేణి రూ.21,700–రూ.69,100
యూనిఫామ్ వేసుకుని పోలీస్ శాఖలో విధులు నిర్వహించాలని కోరుకునే యువత దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉంటారు. అలాంటి వారికి ఢిల్లీ పోలీస్ శాఖలో కొలువులు చక్కటి మార్గంగా చెప్పొచ్చు. ఎంపిక ప్రక్రియలో విజయం సాధించి కొలువులో చేరితే.. చక్కటి వేతనంతోపాటు భవిష్యత్తులో పదోన్నతులు కూడా పొందొచ్చు.
మొత్తం పోస్టులు 7,547
ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7,547 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. మహిళలకు, మాజీ సైనికోద్యుగులకు వేర్వేరుగా ఖాళీల వివరాలను పేర్కొన్నారు. అవి.. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ (పురుషులు)–4,453 పోస్ట్‌లు; కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్(పురుషులు–ఎక్స్ సర్వీస్‌మెన్, ఎస్‌సీ, ఎస్‌టీ బ్యాక్‌లాగ్)–266 పోస్ట్‌లు; కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్(పురుషులు–ఎక్స్‌సర్వీస్‌మెన్ కమెండో)–337 పోస్ట్‌లు; కానిస్టేబుల్ ఎగిక్యూటివ్(మహిళలు)–2,491.
చదవండి: SSC Constable Posts in Delhi: 7547 కానిస్టేబుల్ పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..
అర్హత
- 30.09.2023 నాటికి ఇంటర్మీయెట్, తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత ఉండాలి.
- వయసు: జూలై 1, 2023 నాటికి నాటికి 18–25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు లభిస్తుంది.
ఎంపిక ప్రక్రియ
మొత్తం 7,547 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నాలుగు అంచెల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అవి.. రాత పరీక్ష, ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్‌మెంట్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్.
తొలి దశ రాత పరీక్ష
ఎంపిక ప్రక్రియ తొలి దశలో కంప్యూటర్ బేస్డ్ విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. గంటన్నర వ్యవధిలో నాలుగు విభాగాల్లో 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. జనరల్ నాలెడ్జ్/కరెంట్ అఫైర్స్ 50 ప్రశ్నలు–50 మార్కులు; రీజనింగ్ 25 ప్రశ్నలు–25 మార్కులు; న్యూమరికల్ ఎబిలిటీ 15 ప్రశ్నలు–15 మార్కులు; కంప్యూటర్ ఫండమెంటల్స్ ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, కమ్యూనికేషన్, ఇంటర్నెట్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, వెబ్ బ్రౌజర్స్ నుంచి 10 ప్రశ్నలు–10 మార్కులకు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు.
చదవండి: TRT Notification 2023: తెలంగాణలో 5089 టీచర్ పోస్టులు.. ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్..
రెండో దశలో పీఈ అండ్ ఎంటీ
- తొలిదశ రాత పరీక్షలో చూపిన ప్రతిభ, పొందిన మార్కుల ఆధారంగా ఒక్కో పోస్ట్‌కు 20 మందిని(1:12 నిష్పత్తిలో) చొప్పున తదుపరి దశ ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్‌మెంట్ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం–ఆయా వర్గాలకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు కల్పించిన నేపథ్యంలో.. ఫిజికల్ ఈవెంట్స్‌లో కూడా వయో వర్గాల వారీగా నిబంధనల్లో సడలింపు ఇచ్చారు.
- పరుగు పందెంలో ఉత్తీర్ణత సాధించిన వారికే లాంగ్ జంప్, హై జంప్ ఈవెంట్లు నిర్వహిస్తారు. ఈ రెండు ఈవెంట్లను గరిష్టంగా మూడు అవకాశాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది.
ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్
ఫిజికల్ ఈవెంట్స్ పూర్తి చేసుకున్న వారికి ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ నిర్వహిస్తారు. పురుష అభ్యర్థులు కనీసం 170 సెంటీ మీటర్ల ఎత్తు కలిగుండాలి. అదే విధంగా ఛాతి విస్తీర్ణం 81 సెంటీ మీటర్లు ఉండాలి. శ్వాస పీల్చినప్పుడు నాలుగు సెంటీ మీటర్లు విస్తరించాలి. మహిళా అభ్యర్థులకు కనీస ఎత్తును 157 సెంటీ మీటర్లుగా నిర్దేశించారు.
తుది ఎంపిక
ఎంపిక ప్రక్రియలో చివరగా మెడికల్ ఎగ్జామినేషన్‌ను నిర్వహిస్తారు. ఈ దశలో అభ్యర్థుల ఆరోగ్య ప్రమాణాలను పరిశీలిస్తారు. మొత్తం నాలుగు దశల్లోనూ అభ్యర్థులు చూపిన ప్రతిభ, పొందిన మార్కులు, రిజర్వేషన్ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని తుది విజేతలను ప్రకటిస్తారు.
ప్రారంభ వేతనం
అన్ని దశల్లో విజయం సాధించి నియామకం ఖరారు చేసుకున్న వారికి ప్రారంభ వేతనం రూ.21,700–రూ.69,100 లభిస్తుంది. ఆ తర్వాత డిపార్ట్‌మెంట్ పరీక్షలు, పనితీరు ఆధారంగా.. భవిష్యత్తులో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2023
- ఆన్‌లైన్ దరఖాస్తు సవరణకు అవకాశం: అక్టోబర్ 3,4 తేదీల్లో
- రాత పరీక్ష తేదీ: నవంబర్ 14–డిసెంబర్ 5 మధ్యలో ఉంటాయి.
- వివరాలకు వెబ్‌సైట్: https://ssc.nic.in/
ప్రిపరేషన్ పక్కాగా
జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్
అభ్యర్థుల్లోని సామాజిక అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడిగే విభాగం ఇది. ఇందులో మంచి స్కోర్ సాధించేందుకు భారతదేశ చరిత్ర, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, రాజ్యాంగం, శాస్త్రీయ పరిశోధనలు వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. అదే విధంగా ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకుంటున్న సమకాలీన అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
న్యూమరికల్ ఎబిలిటీ
ఈ విభాగంలో రాణించాలంటే.. ప్యూర్ మ్యాథ్స్‌తోపాటు అర్థ గణిత అంశాలపైనా దృష్టి పెట్టాలి. డెసిమల్స్, ప్రాక్షన్స్, నంబర్స్, పర్సంటేజెస్, రేషియోస్, ప్రపోర్షన్స్, స్క్వేర్ రూట్స్, యావరేజస్, ప్రాఫిట్ అండ్ లాస్, అల్జీబ్రా, లీనియర్ ఈక్వేషన్స్, ట్రయాంగిల్స్, సర్కిల్స్, టాంజెంట్స్, ట్రిగ్నోమెట్రీలపై పట్టు సాధించాలి.
రీజనింగ్
ఈ విభాగంలో టాప్ స్కోర్ కోసం వెర్బల్, నాన్–వెర్బల్ రీజనింగ్ అంశాలపై పట్టు సాధించాలి. స్పేస్ విజువలైజేషన్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనాలజీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలిసిస్, విజువల్ మెమొరీ, అబ్జర్వేషన్, క్లాసిఫికేషన్స్, నంబర్ సిరిస్, కోడింగ్–డీకోడింగ్, నంబర్ అనాలజీ, ఫిగరల్ అనాలజీ, వర్డ్ బిల్డింగ్, వెన్ డయాగ్రమ్స్ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి.
కంప్యూటర్ ఫండమెంటల్స్
ఈ విభాగంలో రాణించేందుకు వర్డ్ ప్రాసెసింగ్‌కు సంబంధించి టూల్స్, అదే విధంగా ఎక్సెల్ షీట్స్, ఇంటర్నెట్ కమ్యూనికేషన్ టూల్స్(ఈ–మెయిల్ బేసిక్స్, ఈ–మెయిల్ రైటింగ్, సెండింగ్/రిసీవింగ్ తదితర) అంశాలపై ప్రాక్టీస్ చేయాలి. వెబ్ బ్రౌజింగ్‌కు సంబంధించి యూఆర్‌ఎల్,హెచ్‌టీటీపీ, ఎఫ్‌టీపీ, వెబ్‌సైట్స్, బ్లాగ్స్, బ్రౌజింగ్ సాఫ్ట్‌వేర్స్, సెర్చ్ ఇంజన్స్, చాటింగ్, వీడియో కాన్ఫరెన్స్ తదితర ఆన్‌లైన్ రిసోర్సెస్‌పై అవగాహన పెంచుకోవాలి.
సమాంతర ప్రిపరేషన్
ప్రస్తుతం పలువురు అభ్యర్థులు రాష్ట్ర స్థాయిలోని ఆయా పోలీస్ నియామక పరీక్షలకు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. వీరు వీటితోపాటు ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్‌కు కూడా ఉపయుక్తంగా ఉండేలా సమాంతర ప్రణాళిక రూపొందించుకోవాలి. ఫలితంగా ఒకే సమయంలో రెండు పరీక్షలకు పోటీ పడే సన్నద్ధత లభిస్తుంది. సిలబస్‌లోని అంశాలు దాదాపు ఒకే విధంగా ఉండటం కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు.
Qualification | 12TH |
Last Date | September 30,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |