Skip to main content

SSC Recruitment 2023: ఇంటర్ అర్హతతో 1207 స్టెనోగ్రాఫర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

న్యూఢిల్లీలోని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ).. దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖల్లో/విభాగాల్లో/సంస్థల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ సి(గ్రూప్‌ బి, నాన్‌ గెజిటెడ్‌), స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ డి(గ్రూప్‌ సి) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
SSC Stenographer Vacancy 2023 Notification

మొత్తం పోస్టుల సంఖ్య: 1207 
విభాగాలు: సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్, సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్, సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ కోఆపరేషన్‌ అండ్‌ ఫార్మర్స్‌ వెల్ఫేర్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ వాటర్‌ రిసోర్సెస్, రివర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రెజువెనేషన్, ఇండియన్‌ మెటియోరాలాజికల్‌ డిపార్ట్‌మెంట్, మినిస్ట్రీ ఆఫ్‌ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్‌ ఎక్స్‌టర్నల్‌ అఫైర్స్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా తదితరాలు.
అర్హత: ఇంటర్మీడియట్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. స్టెనోగ్రఫీలో నైపుణ్యం ఉన్న అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు.
వయసు: 01.08.2023 నాటికి స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-సి పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు, గ్రేడ్‌-డి పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లు మించకూడదు. వివిధ కేటగిరీల వారీగా వయో సడలింపు కల్పించారు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, స్టెనోగ్రఫీలో స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌లో జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్, జనరల్‌ అవేర్‌నెస్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రెహెన్షన్‌ అంశాల్లో ప్రశ్నలుంటాయి.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ,విశాఖపట్నం,హైదరాబాద్,వరంగల్‌

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 23.08.2023
  • దరఖాస్తు సవరణ తేదీలు: 24.08.2023 నుంచి 25.08.2023 వరకు
  • కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష షెడ్యూల్‌: అక్టోబర్‌ 2023.
  • వెబ్‌సైట్‌: https://ssc.nic.in/

చ‌ద‌వండి: India Post Recruitment 2023: ఏ పరీక్ష లేకుండానే 30,041 గ్రామీణ డాక్‌ సేవక్‌ పోస్టులు.. పదో తరగతి పాస్ అయితే చాలు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date August 23,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories