SSC Constable GD Notification: 26,146 కానిస్టేబుల్ పోస్టులు.. పరీక్ష విధానం, సిలబస్ ఇదే.. ఈ టిప్స్ ఫాలో అయితే జాబ్ మీదే !!
- సాయుధ దళాల్లో 26 వేలకు పైగా కానిస్టేబుల్ పోస్టులు
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్
- కొలువు సొంతమైతే పే లెవల్-3తో ప్రారంభ వేతనం
- పదో తరగతి ఉత్తీర్ణతతో పోటీ పడే అవకాశం
మొత్తం పోస్టులు 26,146
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం- కేంద్ర హోంశాఖ పరిధిలోని ఏడు దళాల్లో మొత్తం 26,164 కానిస్టేబుల్ పోస్ట్‌లు భర్తీ చేయనుంది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్-6,174 పోస్టులు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్-11,025 పోస్టులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్-3,337 పోస్టులు, సశస్త్ర సీమాబల్-635 పోస్టులు, ఇండో-టిబెటిన్ బోర్డర్ పోలీస్ 3,189 పోస్టులు, అస్సాం రైఫిల్స్(రైఫిల్‌మెన్)-1,490 పోస్టులు, సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్-296 పోస్టులు. అస్సాం రైఫిల్స్ విభాగంలో రైఫిల్ మెన్ హోదాలో పోస్ట్‌లు ఉన్నాయి. మహిళా అభ్యర్థులకు మొత్తం పోస్ట్‌లలో 2,799 పోస్ట్‌లను కేటాయించారు.
అర్హతలు
- 2024 జనవరి 1 నాటికి పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
- వయసు: 2024 జనవరి 1 నాటికి 18-23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఇస్తారు.
పే లెవల్-3 వేతనం
తుది నియామకాలు ఖరారు చేసుకుని జనరల్ డ్యూటీ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరిన వారికి ప్రారంభంలోనే పే లెవల్-3తో వేతనం అందిస్తారు. అంటే నెలకు రూ.21,700-రూ. 69,100తో నెల వేతన శ్రేణి అందుకోవచ్చు.
మూడు దశల ఎంపిక ప్రక్రియ
కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్ట్‌లకు సంబంధించి మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అవి..రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఈ మూడు దశల తర్వాత డిటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్‌లను కూడా నిర్వహిస్తారు.
చదవండి: 26,146 Constable Jobs: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
160 మార్కులకు రాత పరీక్ష
కానిస్టేబుల్ పోస్ట్‌ల ఎంపిక ప్రక్రియలో తొలి దశ రాత పరీక్షను నాలుగు విభాగాల్లో 160 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 20 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ 20 ప్రశ్నలు-40 మార్కులు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 20 ప్రశ్నలు-40 మార్కులు, ఇంగ్లిష్/హిందీ 20 ప్రశ్నలు-40 మార్కులకు చొప్పున మొత్తం 80 ప్రశ్నలు-160 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం ఒక గంట. పరీక్ష పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గా ఉంటుంది. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు. నెగిటివ్ మార్కుల నిబంధన ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు తగ్గిస్తారు.
ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష
ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్ (జీడీ) పరీక్షను హిందీ, ఇంగ్లిష్‌తోపాటు 13 ప్రాంతీయ భాషల్లో (అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మళయాళం, మణిపురి, మరాఠి, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ) నిర్వహిస్తారు.
పీఎస్‌టీ/పీఈటీ
- తొలిదశ రాత పరీక్ష తర్వాత అభ్యర్థులకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ)లను నిర్వహిస్తారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌కు అర్హత పొందాలంటే..రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు పొందాలి. జనరల్ కేటగరీ అభ్యర్థులు 30 శాతం మార్కులు; ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు 25 శాతం మార్కులు, ఇతర రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు 20 శాతం మార్కులు పొందాలి.
- పీఈటీ: ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు, ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తారు. పురుష అభ్యర్థులు అయిదు కిలోమీటర్లను 24 నిమిషాల్లో, మహిళా అభ్యర్థులు 1.6 కిలో మీటర్ల దూరాన్ని ఎనిమిదిన్నర నిమిషాల్లో చేరుకోవాల్సి ఉంటుంది.
- పీఎస్‌టీ: రాత పరీక్ష తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా తర్వాత దశలో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. పురుష, మహిళా అభ్యర్థులకు వేర్వేరు భౌతిక ప్రామాణికాలు నిర్ణయించారు. పురుష అభ్యర్థులు 170 సెంటీ మీటర్లు, మహిళా అభ్యర్థులు 157 సెంటీ మీటర్ల ఎత్తు ఉండాలి. పురుష అభ్యర్థులకు కనీస ఛాతి కొలత 80 సెంటీ మీటర్లు శ్వాస తీసుకున్నప్పుడు అయిదు సెంటీ మీటర్లు విస్తరించాలి.
తుది ఎంపిక
తుది నియామకాలను ఖరారు చేసే క్రమంలో మొత్తం నాలుగు దశల్లో చూపిన ప్రతిభను పరిగణనలోకి తీసుకుంటారు. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్‌ల్లో పొందిన మార్కులు, ఇతర రిజర్వేషన్ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని తుది విజేతలను ప్రకటిస్తారు. మొత్తం ఈ నాలుగు దశల్లోనూ అభ్యర్థులు కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 31.12.2023
- ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ అవకాశం: 2024 జనవరి 4 - 6 వరకు.
- రాత పరీక్ష తేదీ: 2024 ఫిబ్రవరి/మార్చిలో నిర్వహించే అవకాశం.
- తెలుగు రాష్ట్రాల్లో రాత పరీక్ష కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://ssc.nic.in/
పరీక్షలో రాణించేలా
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్
ఈ విభాగంలో మంచి మార్కుల కోసం వెర్బల్, నాన్-వెర్బల్ రీజనింగ్ అంశాలపై పట్టు సాధించాలి. స్పేస్ విజువలైజేషన్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనాలజీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలిసిస్, విజువల్ మెమొరీ, అబ్జర్వేషన్, క్లాసిఫికేషన్స్, నంబర్ సిరిస్, కోడింగ్-డీకోడింగ్, నంబర్ అనాలజీ, ఫిగరల్ అనాలజీ, వర్డ్ బిల్డింగ్, వెన్ డయాగ్రమ్స్ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
జనరల్ అవేర్‌నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్
ఇందులో స్కోర్ కోసం భారతదేశ చరిత్ర, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, రాజ్యాంగం, శాస్త్రీయ పరిశోధనలు వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. అదే విధంగా ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకుంటున్న సమకాలీన అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి.
ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్
ప్యూర్ మ్యాథ్స్‌తోపాటు అర్థ గణిత అంశాలపై దృష్టి పెట్టాలి. డెసిమల్స్, ప్రాక్షన్స్, నంబర్స్, పర్సంటేజెస్, రేషియోస్,ప్రపోర్షన్స్, స్క్వేర్ రూట్స్, యావరేజస్, ప్రాఫిట్ అండ్ లాస్, అల్జీబ్రా, లీనియర్ ఈక్వేషన్స్, ట్రయాంగిల్స్, సర్కిల్స్, టాంజెంట్స్, ట్రిగ్నోమెట్రీలపై పట్టు సాధించాలి.
ఇంగ్లిష్ లాంగ్వేజ్
ఇంగ్లిష్/ హిందీలలో అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న భాషను ఎంచుకోవచ్చు. అధిక శాతం మంది ఇంగ్లిష్‌నే ఎంచుకుంటున్నారు. ఈ విభాగంలో రాణించడానికి బేసిక్ గ్రామర్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా యాంటానిమ్స్, సినానిమ్స్, మిస్-స్పెల్ట్ వర్డ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, యాక్టివ్/ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇన్‌డైరెక్ట్ స్పీచ్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూటషన్స్, ప్యాసేజ్ కాంప్రహెన్షన్‌లపై పట్టు సాధించాలి.
Qualification | 10TH |
Last Date | December 31,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- SSC Constable GD Notification
- SSC Jobs
- constable Jobs
- General Duty in Central Armed Forces
- SSC GD Constable Exam Syllabus
- Border Security Force
- Central Industrial Security Force Jobs
- Central Reserve Police Force
- Sashastra Seemabal
- Indo-Tibetan Border Police
- Assam Rifles
- Secretariat Security Force
- latest jobs in 2023
- Sakshi Education Latest News