Skip to main content

CRPF Recruitment 2024: సీఆర్‌పీఎఫ్‌లో 169 కానిస్టేబుల్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌).. స్పోర్ట్స్‌ కోటా కింద గ్రూప్‌ సి విభాగంలో కానిస్టేబుల్‌(జనరల్‌ డ్యూటీ) నాన్‌-గెజిటెడ్‌ అండ్‌ నాన్‌ మినిస్టీరియల్‌ ఖాళీల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులు భారతదేశం, విదేశాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
constable jobs in crpf  Central Reserve Police Force  jobs    CRPF Constable Recruitment

మొత్తం పోస్టుల సంఖ్య: 169
క్రీడలు: జిమ్నాస్టిక్, జూడో, వుషు, షూటింగ్, బాక్సింగ్, అథ్లెటిక్స్, ఆర్చరీ, రెజ్లింగ్, ఫ్రీ స్టైల్, గ్రీకో రోమన్, తైక్వాండో, వాటర్‌ స్పోర్ట్స్‌ కయాక్, కానో, రోయింగ్, బాడీ బిల్డింగ్, వెయిట్‌ లిఫ్టింగ్, స్విమ్మింగ్, ట్రయత్లాన్, డైవింగ్, డైవింగ్‌ ఈక్వెస్ట్రియన్, యాచింగ్, ఐస్‌ హాకీ, ఐస్‌ స్కేటింగ్, ఐస్‌ స్కైయింగ్‌.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. నిర్దిష్ట శారీరక దారుఢ్యంతో పాటు సంబంధిత క్రీడాంశాల్లో అర్హత సాధించి ఉండాలి.
వయసు: 15.02.2024 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: రూ.21,700 నుంచి రూ.69,100.

ఎంపిక విధానం: క్రీడా ప్రదర్శన, స్పోర్ట్స్‌ ట్రయల్‌ టెస్ట్, మెడికల్‌ ఎగ్జామినేషన్, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.02.2024

వెబ్‌సైట్‌: https://recruitment.crpf.gov.in/

చదవండి: Indian Airforce Notification 2024: అగ్నివీర్‌లకు ఆహ్వానం.. ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం ఇదే..

sakshi education whatsapp channel image link

Qualification 10TH
Last Date February 15,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories