Skip to main content

26,146 Constable Jobs: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ).. వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్‌ /రైఫిల్‌మ్యా¯Œ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
SSC GD Constable Recruitment 2024 Notification for 26146 Jobs     Central Armed Forces Constable Application Form    SSC Recruitment Notification

మొత్తం పోస్టుల సంఖ్య: 26,146.
పోస్టుల వివరాలు: బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌)–6,174, సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎస్‌ఎఫ్‌)–11,025, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌)–3,337, సశస్త్ర సీమబల్‌(ఎస్‌ఎస్‌బీ)–635, ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌(ఐటీబీపీ)–3,189, అస్సాం రైఫిల్స్‌(ఏఆర్‌)–1490, సెక్రటేరియట్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(ఎస్‌ఎస్‌ఎఫ్‌)–296.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్శిటీ నుంచి మెట్రిక్యులేషన్‌ లేదా పదో తరగతి పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీలు, మహిళా అభ్యర్థులకు 157 సెం.మీలకు తగ్గకూడదు.
వయసు: 01.01.2024 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 మధ్య చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్ట్‌ ఎగ్జామినేషన్, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.

ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.12.2023
ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపు చివరితేది: 01.01.2024
దరఖాస్తు సవరణ తేదీలు: 04.01.2024, 05.01.2024, 06.01.2024.
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తేది: ఫిబ్రవరి–మార్చి 2024.
వెబ్‌సైట్‌: https://ssc.nic.in/

చ‌ద‌వండి: IB ACIO Notification 2023: ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో 995 పోస్టులు.. పరీక్ష విధానం ఇదే..

Qualification 10TH
Last Date December 31,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories