Skip to main content

TSRTC Job Notification 2024: టీఎస్‌ఆర్టీసీలో 150 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ).. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ టీఎస్‌ఆర్టీసీ రీజియన్ల(డిపో/యూనిట్‌)లో నాన్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో అప్రెంటిస్‌ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
TSRTC Career Development   TSRTC Career Development   TSRTC Vacancies in Non-Engineering Department  TSRTC Apprenticeship Notification 2024  Apply Now for TSRTC Apprenticeship

మొత్తం ఖాళీల సంఖ్య: 150; శిక్షణ వ్యవధి: మూడేళ్లు.
రీజియన్‌ల వారీగా ఖాళీలు: హైదరాబాద్‌ రీజియన్‌-26, సికింద్రాబాద్‌ రీజియన్‌-18, మహబూబ్‌ నగర్‌ రీజియన్‌-14, మెదక్‌ రీజియన్‌-12, నల్గొండ రీజియన్‌-12, రంగారెడ్డి రీజియన్‌-12, ఆదిలాబాద్‌ రీజియన్‌-09, కరీంనగర్‌ రీజియన్‌-15, ఖమ్మం రీజియన్‌-09, నిజామాబాద్‌ రీజియన్‌-09, వరంగల్‌ రీజియన్‌-14.
అర్హత: బీకాం, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ కోర్సు 2018, 2019, 2020, 2021, 2022, 2023 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్‌: మొదటి, రెండు, మూడు సంవత్సరాలకు వరుసగా నెలకు రూ.15,000, రూ.16,000, రూ.17,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: విద్యార్హతలు, ధ్రువపత్రాల పరిశీలన, స్థానికత, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: దరఖాస్తు సమర్పణకు ముందు https://nats.education.gov.in/ వెబ్‌సైట్‌లో అభ్యర్థులు వివరాలను నమోదు చేసుకోవాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 16.02.2024.

వెబ్‌సైట్‌: https://www.tsrtc.telangana.gov.in/

చదవండి: CRPF Recruitment 2024: సీఆర్‌పీఎఫ్‌లో 169 కానిస్టేబుల్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date February 16,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories