Skip to main content

ITBP Recruitment 2023: ఐటీబీపీలో 458 కానిస్టేబుల్‌ పోస్టులు.. రాత పరీక్ష ఇలా‌..

పదోతరగతి ఉత్తీర్ణులై సర్కారీ కొలువు కోసం అన్వేషిస్తున్న అభ్యర్థులకు తీపి కబురు. కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌(ఐటీబీపీ).. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డ్రైవింగ్‌ లైసెన్స్, ఫిజికల్‌ ఎఫిషియ­న్సీ టెస్ట్, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్, మెడికల్‌ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జూలై 26 తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ITBP Constable Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 458

  • పోస్టుల వివరాలు: కానిస్టేబుల్‌ (డ్రైవర్‌) గ్రూప్‌-సి, నాన్‌-గెజిటెడ్‌ (నాన్‌ మినిస్టీరియల్‌)-458 పోస్టులు (యూఆర్‌-195, ఎస్సీ-74, ఎస్టీ-37, ఓబీసీ-110, ఈడబ్ల్యూఎస్‌-42)

అర్హతలు

  • గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి మెట్రిక్యులేషన్‌ లేదా పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వ్యాలిడ్‌ హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ (హెచ్‌ఎంవీ) కలిగి ఉండాలి.
  • వయసు: 21 నుంచి 27 ఏళ్లు మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.

ఎంపిక ఇలా

  • ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌(పీఈటీ), ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌(పీఎస్‌టీ), రాత పరీక్ష, ఒరిజినల్‌ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, ప్రాక్టికల్‌ డ్రైవింగ్‌ స్కిల్‌ టెస్ట్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • పీఈటీ, పీఎస్‌టీ అర్హత పరీక్షలు. కాగా రాత పరీక్ష 100 మార్కులకు, డ్రైవింగ్‌ టెస్ట్‌ 50 మార్కులకు ఉంటాయి.

ఫిజికల్‌ స్టాండర్డ్‌టెస్ట్‌(పీఎస్‌టీ)
ఎత్తు: అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అభ్యర్థులు 170 సెం.మీ; అస్సాం, హిమాచల్‌ ప్రదేశ్‌; జమ్మూ కాశ్మీర్, లద్దాక్‌కు చెందిన గుర్కాస్, డోగ్రాస్‌ తదితర ప్రత్యేక వర్గాలు వారు 165 సెం.మీ, కొండ ప్రాంతాలోన్లి నార్త్‌-ఈస్టర్న్‌ రాష్ట్రాల వారు 162.5 సెం.మీ. ఎత్తు, ఇతరులు 160 సెం.మీ ఎత్తు ఉండాలి. అలాగే ఛాతీ ఊపిరి పీల్చినప్పుడు, వదిలినప్పుడు 80-85 మధ్య వ్యత్యాసం ఉండాలి. ప్రత్యేక వర్గాల వారికి 5 సెం.మీ మేర సడలింపు వర్తిస్తుంది.

ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌(పీఈటీ)
ఈ పరీక్షలో భాగంగా 1.6 మీటర్ల దూరాన్ని పురుషులు 7.30 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. 11 ఫీట్ల లాంగ్‌ జంప్‌ను మూడు ప్రయత్నాల్లో, 3 1/2 ఫీట్‌ హైజంప్‌ను 3 ప్రయత్నాల్లో పూర్తిచేయాలి.

రాత పరీక్ష
ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్‌ నాలెడ్జ్‌ 10 ప్రశ్నలు- 10 మార్కులు, మ్యాథమెటిక్స్‌ 10ప్రశ్నలు-10 మార్కులు, హిందీ 10 ప్రశ్నలు-10 మార్కులు, ఇంగ్లిష్‌ 10 ప్రశ్నలు-10 మార్కులు, ట్రేడ్‌ రిలేటెడ్‌ థియరీ క్వశ్చన్స్‌ 60- ప్రశ్నలు 60 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు.

డ్రైవింగ్‌ టెస్ట్‌
రాత పరీక్షలో అర్హత సాధించిన వారిని షార్ట్‌లిస్ట్‌ చేసి డ్రైవింగ్‌ టెస్ట్‌కు పిలుస్తారు. ఈ పరీక్షకు 50మార్కులు ఉంటాయి.ఇందులో భాగంగా ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన ట్రాక్స్‌ మీద హెవీ అండ్‌ లైట్‌ మోటర్‌ వెహికిల్స్‌­కు సంబంధించి ప్రాక్టీకల్‌ టెస్టులను నిర్వహిస్తారు. ఇవే కాకుండా వెహికల్‌ మె­యింటెన్స్, వివిధ పరిస్థితుల్లో డ్రైవింగ్‌ చేసే విధానాన్ని గమనిస్తారు.

తుది ఎంపిక
రాత పరీక్ష, డ్రైవింగ్‌ టెస్టులో ఎంపికైన వారికి డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ నిర్వహిస్తారు. సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ పూర్తయిన అభ్యర్థులకు మెడికల్‌ టెస్టులను నిర్వహించి తుదిగా ఎంపి­క చేసి..ఉద్యోగాల్లోకి తీసుకుంటారు.

వేతనాలు

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పే లెవల్‌-3 ప్రకారం- రూ.21,700-69,100 వరకు వేతన శ్రేణి లభిస్తుంది.

ముఖ్యసమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 26, 2023
  • వెబ్‌సైట్‌: https://itbpolice.nic.in/​​​​​​​

చ‌ద‌వండి: ITBP Recruitment 2023: పదో తరగతి అర్హతతో 458 కానిస్టేబుల్‌(డ్రైవర్‌) పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date July 26,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories