Skip to main content

Railway Latest Notification 2024: ఆర్‌ఆర్‌బీలో 5,696 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

దేశవ్యాప్తంగా రైల్వే శాఖ(రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు) అన్నీ రైల్వే రీజియన్లలో అసిస్టెంట్‌ లోకో పైలట్‌(ఏఎల్‌పీ) పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతోంది.
Assistant Loco Pilot Application   Railway Careers  Apply Now for Assistant Loco Pilot  ALP Job Opportunity  railway latest notification 2024 for 5696 assistant loco pilot jobs    Railway Recruitment Board

మొత్తం పోస్టుల సంఖ్య: 5,696
ఆర్‌ఆర్‌బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు,భోపాల్,భువనేశ్వర్, బిలాస్‌పూ­ర్, చంఢీగడ్, చెన్నై, గువాహటి, జమ్మూ అండ్‌ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబై, ముజఫర్‌పూర్, పాట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్,సిలిగురి,తిరువనంతపురం, గోరఖ్‌పూర్‌.
కేటగిరీ వారీగా పోస్టులు: యూఆర్‌-2499, ఎస్సీ-804, ఎస్టీ-482, ఓబీసీ-1351, ఈడబ్ల్యూఎస్‌-560, ఎక్స్‌ఎస్‌ఎం-572.
ఆర్‌ఆర్‌బీ రీజియన్ల వారీగా ఖాళీలు: అహ్మదాబాద్‌-238, అజ్మీర్‌-228, బెంగళూరు-473, భోపాల్‌-284, భువనేశ్వర్‌-280, బిలాస్‌పూర్‌-1316, చంఢీగడ్‌-66, చెన్నై-148, గువాహటి-62, జమ్మూ అండ్‌ శ్రీనగర్‌-39, కోల్‌కతా-345, మాల్దా-217, ముంబై-547, ముజఫర్‌పూర్‌-38, పాట్నా-38, ప్రయాగ్‌రాజ్‌-286, రాంచీ-153, సికింద్రాబాద్‌-758, సిలిగురి-67, తిరువనంతపురం-70, గోరఖ్‌పూర్‌-43.
అర్హత: అభ్యర్థులు మెట్రిక్యులేషన్‌తోపాటు ఐటీఐ(ఫిట్టర్‌/ఎలక్ట్రీషియన్‌ /ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌/మిల్‌రైట్‌/మెయింటెనెన్స్‌ మెకానిక్‌/మెకానిక్‌-రేడియో అండ్‌ టీవీ/ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌/మెకానిక్‌-మోటార్‌ వెహికల్‌/వైర్‌మ్యాన్‌/ట్రాక్టర్‌ మెకానిక్‌/ఆర్మేటర్‌ అండ్‌ కాయిల్‌ వైండర్‌/మెకానిక్‌-డీజిల్‌/హీట్‌ ఇంజిన్‌ /టర్నర్‌/మెషినిస్ట్‌/రిఫ్రిజెరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ మెకానిక్‌)పూర్తిచేసి ఉండాలి. లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ లేదా ఆటోమొౖ»ñ ల్‌ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా చేసినవారు అర్హులే.
వయసు: 01.07.2024 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
పే స్కేల్‌: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200.

ఎంపిక విధానం: ఫస్ట్‌ స్టేజ్‌ సీబీటీ-1, సెకండ్‌ స్టేజ్‌ సీబీటీ-2, కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్ష విధానం: సీబీటీ-1కు 60 నిమిషాల సమయం ఉంటుంది. మొత్తం 75 ప్రశ్నలకు 75 మార్కులు కేటాయించారు. నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. మ్యాథ్స్, మెంటల్‌ ఎబిలిటీ, జనరల్‌ సైన్స్, జనరల్‌ అవేర్‌నెస్‌ అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. సీబీటీ-2లో రెండు విభాగాలు ఉంటాయి. పార్ట్‌-ఏ విభాగానికి 90 నిమిషాల వ్యవధి, 100 ప్రశ్నలు, పార్ట్‌-బి విభాగానికి 60 నిమిషాల వ్యవధి, 75 ప్రశ్నలు వస్తాయి. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. పార్ట్‌-ఏలో మ్యాథ్స్, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్, బేసిక్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, పార్ట్‌-బిలో సంబంధిత ట్రేడ్‌ సిలబస్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 19.02.2024.
దరఖాస్తులో మార్పులకు అవకాశం: 20.02.2024 నుంచి 29.02.2024 వరకు.

వెబ్‌సైట్‌: https://indianrailways.gov.in/

చదవండి: Railway Jobs 2024: రైల్వేలో 1646 యాక్ట్‌ అప్రెంటిస్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవే..

sakshi education whatsapp channel image link

Qualification 10TH
Last Date February 19,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories