Skip to main content

APPSC Notification 2024: ఏపీపీఎస్సీలో 99 పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ).. ఏపీ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీస్‌కు సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో(ఇంజనీరింగ్, నాన్‌ ఇంజనీరింగ్‌) లెక్చరర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Job Application Form    APPSC  Public Service Commission    AP Technical Education Service Career Opportunity     Lecturer Position    Government Polytechnic Colleges   APPSC Polytechnic Lecturer Notification 2024   Government Polytechnic Colleges

మొత్తం పోస్టుల సంఖ్య: 99
సబ్జెక్ట్‌ల వారీగా ఖాళీలు: ఆర్కిటెక్చరల్‌ ఇంజనీరింగ్‌-01, ఆటో మొబైల్‌ ఇంజనీరింగ్‌-08, బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌-02, కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీస్‌-12, సిరామిక్‌ టెక్నాలజీ-01, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌-04, కెమిస్ట్రీ-08, సివిల్‌ ఇంజనీరింగ్‌-15, కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌-08, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌-10, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌-02, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌-01, ఇంగ్లిష్‌-04, గార్మెంట్‌ టెక్నాలజీ-01, జియాలజీ-01, మ్యాథమేటిక్స్‌-04, మెకానికల్‌ ఇంజనీరింగ్‌-06, మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌-01, మైనింగ్‌ ఇంజనీరింగ్‌-04, ఫార్మసీ-03, టెక్స్‌టైల్‌ టెక్నాలజీ-03.
అర్హత: సంబంధిత బ్రాంచ్‌లో ప్రథమ శ్రేణిలో బీఈ/బీటెక్, బీఫార్మసీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీస్‌ విభాగానికి పీజీతోపాటు ఇంగ్లిష్‌ టైప్‌రైటింగ్‌ హయ్యర్‌గ్రేడ్, షార్ట్‌హ్యాండ్‌ హయ్యర్‌ గ్రేడ్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.56,100 నుంచి రూ.98,400.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష మెరిట్, మౌఖిక పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 29.01.2024.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 18.02.2024.
రాతపరీక్ష తేది: ఏప్రిల్‌/మే 2024.

వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in/

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date February 18,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories