Skip to main content

SSC JHT 2023 Notification: ఎస్‌ఎస్‌సీ–జేహెచ్‌టీ, జేటీ, ఎస్‌హెచ్‌టీ పరీక్ష–2023

స్టాఫ్‌ సెలక్షన్‌ సెలక్షన్‌(ఎస్‌ఎస్‌సీ).. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్‌ ట్రాన్స్‌లేటర్, సీనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్షకు సంబంధించి సంక్షిప్త ప్రకటనను విడుదల చేసింది. దీని ద్వారా సెంట్రల్‌ సెక్రటేరియట్, రైల్వే బోర్డులు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, సెంట్రల్‌ హిందీ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో పోస్టులు భర్తీ చేయనున్నారు.
SSC JHT 2023 Notification

అర్హత: పోస్టును అనుసరించి మాస్టర్‌ డిగ్రీ(హిందీ/ఇంగ్లిష్‌) డిగ్రీ స్థాయిలో హిందీ/ఇంగ్లిష్‌ సబ్జెక్టు పాఠ్యాంశంగా ఉండాలి. దీనితోపాటు ట్రాన్స్‌లేషన్‌ (హిందీ/ఇంగ్లిష్‌) డిప్లొమా/సర్టిఫికేట్‌ కోర్సు చేసి ఉండాలి లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలో రెండేళ్ల ట్రాన్స్‌లేషన్‌ అనుభవం ఉండాలి. సీనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌ పోస్టులకు సంబంధిత విభాగంలో మాస్టర్‌ డిగ్రీతోపాటు మూడేళ్ల ట్రాన్స్‌లేషన్‌ అనుభవం ఉండాలి. బ్యాచిలర్‌ డిగ్రీ/పీజీ(హిందీ/ఇంగ్లిష్‌) అర్హతతోపాటు తగు అనుభవం ఉండాలి. డిగ్రీ స్థాయిలో హిందీ/ఇంగ్లిష్‌ సబ్జెక్టు పాఠ్యాంశంగా ఉండాలి. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో సీనియర్‌ సెకండరీ స్థాయిలో రెండేళ్ల హిందీ బోధన అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. 

ఎంపిక విధానం: రాతపరీక్ష(పేపర్‌–1, పేపర్‌–2), డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ద్వారా ఎంపికచేస్తారు.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 22.08.2023.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.09.2023
  • పరీక్ష తేదీలు: అక్టోబర్‌/నవంబర్‌ 2023.
  • వెబ్‌సైట్‌: https://ssc.nic.in/

 

చ‌ద‌వండి: SSC CPO Preparation Tips: 1,876 ఎస్‌ఐ పోస్టులు.. పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 12,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories