Skip to main content

CSIR-CASE Notification: 444 అడ్మినిస్ట్రేటివ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. ఎంపిక విధానం ఇలా..

బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు సర్కారీ కొలువుల నోటిఫికేషన్‌. గ్రూప్‌–బి గెజిటెడ్‌ హోదాలో కేంద్ర ప్రభుత్వ కొలువు సొంతం చేసుకునే చక్కటి అవకాశం! దేశంలోనే అత్యున్నతమైన పరిశోధన సంస్థ.. కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌(సీఎస్‌ఐఆర్‌).. మొత్తం 444 అడ్మినిస్ట్రేటివ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందుకోసం కంబైన్డ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌(సీఏఎస్‌ఈ)–2023ను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో.. సీఎస్‌ఐఆర్‌–సీఏఎస్‌ఈ నోటిఫికేషన్‌ వివరాలు, పోస్ట్‌లు, ఎంపిక విధానం తదితర వివరాలు..
444 Group-B Gazetted Administrative Posts  CSIR Recruitment  CSIR Notification for 444 Administrative Vacancies   CSIR Notification  CSIR CASE Notification   CSIR Administrative Posts for Bachelor's Graduates
  • సీఎస్‌ఐఆర్‌లో 444 పోస్ట్‌ల భర్తీకి ప్రకటన
  • కంబైన్డ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌ పరీక్ష ద్వారా ఎంపిక
  • పే లెవల్‌ 7, 8 లతో ప్రారంభ వేతన శ్రేణి
  • డిగ్రీ ఉత్తీర్ణతతో పోటీ పడే అవకాశం

మొత్తం 444 పోస్ట్‌లు
సీఎస్‌ఐఆర్‌–సీఏఎస్‌ఈ తాజా నోటిఫికేషన్‌ ద్వారా.. మొత్తం 444 సెక్షన్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. ఇందులో సెక్షన్‌ ఆఫీసర్‌(జనరల్, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్, స్టోర్స్‌ అండ్‌ పర్చేజ్‌)–76 పోస్టులు, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌(జనరల్, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్, స్టోర్స్‌ అండ్‌ పర్చేజ్‌) – 368 పోస్టులు ఉన్నాయి. సీఎస్‌ఐఆర్‌.. సైన్స్‌ పరిశోధనల్లో మేటి సంస్థ. ఈ సంస్థ పరిపాలన విభాగాల్లో సెక్షన్‌ ఆఫీసర్స్, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్స్‌ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్ష సీఏఎస్‌ఈ.

అర్హతలు

  • బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. 
  • వయసు: 2024,జనవరి 12 నాటికి 33 ఏళ్లు (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు) ఉండాలి.


వేతనం

  • సెక్షన్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లు.. గ్రూప్‌–బి గెజిటెడ్, నాన్‌ గెజిటెడ్‌ ర్యాంక్‌ ఉద్యోగాలు. ఈ పోస్ట్‌లకు ప్రారంభ వేతన శ్రేణి పే లెవల్‌ 7, 8 లలో ఉంటుంది.
  • సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు పే లెవల్‌ 8(రూ.47,600–రూ.1,51,000); అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు పే లెవల్‌ 7(రూ.44,900–రూ.­1,42,400)తో ప్రారంభ వేతనం అందుతుంది.

చదవండి: CSIR-CCMB Recruitment 2024: సీసీఎంబీ, హైదరాబాద్‌లో 40 టెక్నీషియన్‌ పోస్టులు.. ట్రేడ్‌ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా ఎంపిక

మూడు దశల ఎంపిక ప్రక్రియ
సెక్షన్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు మూడు దశల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అవి.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, కంప్యూటర్‌ ప్రోఫిషియన్సీ టెస్ట్‌. రాత పరీక్ష రెండు పోస్ట్‌లకు కామన్‌గా ఉంటుంది. ఆ తర్వాత దశలో సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్ట్‌ల అభ్యర్థులకు మాత్రం 100 మార్కులకు పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్ట్‌ల అభ్యర్థులకు పర్సనల్‌ ఇంటర్వ్యూ ఉండదు. వీరికి 100 మార్కులకు కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ నిర్వహిస్తారు.

సీఏఎస్‌ఈ రాత పరీక్ష

  • సీఏఎస్‌ఈ రాత పరీక్షను మూడు పేపర్లుగా 500 మార్కులకు నిర్వహిస్తారు. 
  • పేపర్‌ 1లో జనరల్‌ అవేర్‌నెస్‌(100 ప్రశ్నలు), ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌(50 ప్రశ్నలు) 150 మార్కులకు; పేపర్‌ 2లో జనరల్‌ ఇంటెలిజెన్స్, రీజనింగ్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ 200 మార్కులకు; పేపర్‌ 3లో ఇంగ్లిష్‌/ హిందీ డిస్క్రిప్టివ్‌ పేపర్‌ 150 మార్కులకు ఉంటాయి. 
  • పేపర్‌–1, పేపర్‌–2లలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. నెగిటివ్‌ మార్కుల నిబంధన ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కులు తగ్గిస్తారు. 
  • పేపర్‌–3ని డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌గా నిర్వహిస్తారు. అభ్యర్థులు ఇంగ్లిష్‌ లేదా హిందీలో ఎస్సే రైటింగ్, లెటర్‌ రైటింగ్, అప్లికేషన్‌ రైటింగ్‌ రాయాల్సి ఉంటుంది.
  • పేపర్‌–1, 2లలో సాధించిన మార్కుల ఆధారంగా పేపర్‌–3కి ఎంపిక చేస్తారు.
  • సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు సంబంధించి మూడు పేపర్లలో పొందిన మార్కుల ఆధారంగా పర్సనల్‌ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
  • అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు సంబంధించి పేపర్‌–1, పేపర్‌–2లలో చూపిన ప్రతిభ ఆధారంగా పేపర్‌–3కి, అదే విధంగా కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ను అర్హత పరీక్షగానే పేర్కొన్నారు. మూడు పేపర్లలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది విజేతలను ఖరారు చేస్తారు.

జేఎస్‌ స్థాయికి చేరుకునే అవకాశం
సీఏఎస్‌ఈలో ప్రతిభ చూపి సెక్షన్‌ ఆఫీసర్స్‌గా నియమితులైన వారు భవిష్యత్తులో అండర్‌ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, డైరెక్టర్, జాయింట్‌ సెక్రటరీ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. అదే విధంగా అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్ట్‌కు ఎంపికైన వారు డైరెక్టర్‌ స్థాయి వరకు చేరుకోవచ్చు.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 2024, జనవరి 12
  • పేపర్‌–1, 2 పరీక్ష: 2024 ఫిబ్రవరిలో. 
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://csir.cbtexamportal.in/, https://www.csir.res.in/

రాత పరీక్షలో రాణించేలా
జనరల్‌ అవేర్‌నెస్‌
భారత చరిత్ర, జాతీయోద్యయం, భారత రా­జ్యాంగం, పాలిటీ, గవర్నెన్స్, సోషల్‌ జస్టిస్, జాతీయ/అంతర్జాతీయ ప్రాధాన్యం సంతరించుకున్న సమకాలీన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

చదవండి: APPSC Notification 2024: ఏపీపీఎస్సీలో 99 పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌
యాక్టివ్‌ అండ్‌ ప్యాసివ్‌ వాయిస్, ప్రిపొజిషన్స్, ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్, సినానిమ్స్, యాంటానిమ్స్, సెంటెన్స్‌ కరెక్షన్, కామన్‌ ఎర్రర్స్, పంక్చుయేషన్స్, ఇడియమ్స్‌ అండ్‌ ఫ్రేజెస్‌ తదితర బేసిక్‌ గ్రామర్‌ అంశాలతోపాటు కాంప్రహెన్షన్‌పై పట్టు సాధించాలి. ఇందుకోసం ఇంగ్లిష్‌ న్యూస్‌ పేపర్లను చదవడం, వాటిలో వాక్య నిర్మాణాన్ని అవగాహన చేసుకోవడం, గ్రామర్‌ యూసేజ్‌లపై దృష్టి సారించడం వంటివి చేయాలి.

జనరల్‌ ఇంటెలిజెన్స్‌
వెర్బల్, నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌ నుంచి ప్రశ్నలు అడిగే విభాగం ఇది. ఇందులో రాణించాలంటే.. సిరీస్‌(నంబర్‌/ఆల్ఫాన్యుమరిక్‌) విభాగం, అనాలజీస్, ఆడ్‌ మెన్‌ ఔట్, సిలాజిజమ్, మ్యాట్రిక్స్, డైరెక్షన్, వర్డ్‌ ఫార్మేషన్, బ్లడ్‌ రిలేషన్స్, నాన్‌ వెర్బల్‌ (వాటర్‌ ఇమేజ్, మిర్రర్‌ ఇమేజ్‌), కోడింగ్‌–డీకోడింగ్‌ అంశాలపై పట్టు సాధించాలి.

అర్థమెటిక్‌ అండ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ
ఈ విభాగంలో అర్థగణిత అంశాలైన సింపుల్‌ ఇంట్రెస్ట్, కంపౌండ్‌ ఇంట్రెస్ట్,లాభ నష్టాలు, ప్రాఫి­ట్‌ అండ్‌ లాస్, శాతాలపై ప్రాక్టీస్‌ చేయాలి. అదే విధంగా,త్రికోణమితి,అల్జీబ్రా,జామెట్రీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్,టైం అండ్‌ వర్క్,టైం అండ్‌ డిస్టెన్స్‌ల­కు సంబంధించిన ప్రశ్నలను కూడా ప్రాక్టీస్‌ చేయాలి.

జనరల్‌ సైన్స్‌

  • ఈ విభాగానికి సంబంధించి ఆరు నుంచి పదో తరగతి వరకు సైన్స్‌ పాఠ్య పుస్తకాల్లోని అంశాలను అధ్యయనం చేయాలి. అదే విధంగా వ్యాధులు–చికిత్స, ఔషధాలు, ప్లాంట్‌ అనాటమీ, మార్ఫాలజీ, యానిమల్‌ కింగ్‌ డమ్‌ తదితర అంశాలపై దృష్టి సారించాలి.
  • ఆర్థిక, సామాజిక అభివృద్ధి అంశాలు, పర్యావరణ సమస్యలు, జీవ వైవిధ్యం, పర్యావరణ మార్పు తదితర అంశాలకు సంబంధించి అవగాహన ఏర్పరచుకోవాలి. వీటితోపాటు.. ఎథిక్స్, ఇంటెగ్రిటీ, ఆప్టిట్యూడ్, డెసిషన్‌ మేకింగ్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ నైపుణ్యాలను పెంచుకోవాలి. అదే విధంగా మేనేజ్‌మెంట్‌ సిద్ధాంతాలు, కార్యాచరణ వంటి వాటిపై దృష్టి పెట్టాలి.

డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ ఇలా
డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌కు సంబంధించి రెండు ఎస్సేలు, ఒక ప్రెసిస్‌ రైటింగ్, ఒక లెటర్‌ రైటింగ్‌/అప్లికేషన్‌ రైటింగ్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందుకోసం అభ్యర్థులు ఎస్‌బీఐ, ఐబీపీఎస్‌ పాత ప్రశ్న పత్రాలను సాధన చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. అదే విధంగా దిన పత్రికల్లో ఎడిటోరియల్స్‌ చదవాలి. ఫలితంగా సమకాలీన అంశాలకు సంబంధించిన వ్యాసాలపై పట్టు సాధించొచ్చు.

కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌
ఈ పరీక్షలో రాణించేందుకు.. వర్డ్‌ ప్రాసెసింగ్, స్ప్రెడ్‌ షీట్స్‌ జనరేషన్, స్లైడ్స్‌ జనరేషన్‌ వంటి అంశాలపై పట్టు సాధించాలి. అదే విధంగా కీ బోర్డ్‌ షాట్‌ కట్స్, బేసిక్‌ హార్డ్‌వేర్‌కు సంబంధించిన అంశాలు తెలుసుకోవాలి.

Qualification GRADUATE
Last Date January 12,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories