Skip to main content

SSC CGL 2022: మార్చి 2 నుంచి SSC ప‌రీక్ష‌లు...పూర్తి వివ‌రాలు ఇవే

కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని వివిధ పోస్టుల భర్తీకి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ - 2022(సీజీఎల్) నిర్వహణ తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఖరారు చేసింది.
SSC CGL

20 వేల ఉద్యోగాల భ‌ర్తీ....
స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల్లో 35 హోదాల్లో దాదాపు 20 వేల ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది. వీటిలో అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఇన్‌కం ట్యాక్స్, సెంట్రల్‌ ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్, ఇన్‌స్పెక్టర్‌(ప్రివెంటివ్‌ ఆఫీసర్‌), ఇన్‌స్పెక్టర్‌ (ఎగ్జామినర్‌), అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌(గ్రూప్‌-బి), సీబీఐలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(గ్రూప్‌-బి), కాగ్‌లో డివిజినల్‌ అకౌంటెంట్‌(గ్రూప్‌-బి) వంటి పోస్టులు ఉన్నాయి

ఎస్‌ఎస్‌సీ నిర్వహించనున్న సీజీఎల్‌ఈ పరీక్ష టైర్‌-1, టైర్‌-2 పేరుతో రెండు దశలుగా ఉంటుంది.

టైర్‌-1 పరీక్ష...
తొలి దశలో టెర్‌-1 పరీక్ష 100 ప్రశ్నలు-200 మార్కులకు జరుగుతుంది. ఇందులో జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌(25 ప్రశ్నలు), జనరల్‌ అవేర్‌నెస్‌(25 ప్రశ్నలు), క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌(25 ప్రశ్నలు), ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌(25 ప్రశ్నలు) నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు కేటాయిస్తారు. పరీక్ష సమయం 1గంట.

చ‌ద‌వండి: SSC CGL నోటిఫికేష‌న్‌.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి
టైర్‌-2లో నాలుగు పేపర్లు....
టైర్‌-1లో నిర్దిష్ట కటాఫ్‌ మార్కులు సాధించి.. మెరిట్‌ జాబితాలో నిలిచిన వారికి తదుపరి దశలో టైర్‌-2 పరీక్ష నిర్వహిస్తారు. టైర్‌-2 పరీక్ష మొత్తం నాలుగు పేపర్లలో జరుగుతుంది.
పేపర్‌-1: పేపర్‌-1ను సెషన్‌-1, సెషన్‌-2లుగా నిర్వహిస్తారు. అదే విధంగా ప్రతి సెషన్‌ను రెండు సెక్షన్‌లుగా పేర్కొన్నారు. సెషన్‌-1(సెక్షన్‌-1)లో మ్యాథమెటికల్‌ ఎబిలిటీస్‌(మాడ్యూల్‌-1), రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌(మాడ్యూల్‌-2) విభాగాల నుంచి 30 ప్రశ్నలు చొప్పున మొత్తం 60 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు చొప్పున 180 మార్కులు ఉంటాయి. 

సెషన్‌-1 సెక్షన్‌-2లో.. మాడ్యూల్‌-1 పేరుతో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌లో 45 ప్రశ్నలు, మాడ్యూల్‌-2 పేరిట జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగాల్లో 25 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 70 ప్రశ్నలకు 210 మార్కులు ఉంటాయి. 

సెషన్‌-1 సెక్షన్‌-3లో మాడ్యూల్‌-1 పేరుతో కంప్యూటర్‌ నాలెడ్జ్‌ నుంచి 20 ప్రశ్నలతో 60 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 

చ‌ద‌వండి: SSC CGL ప‌రీక్ష సిల‌బ‌స్ కోసం క్లిక్ చేయండి
సెషన్‌-2లో సెక్షన్‌-3 పేరుతో డేటాఎంట్రీ స్పీడ్‌ టెస్ట్‌ను (మాడ్యూల్‌-3) 15 నిమిషాల వ్యవధిలో నిర్వహిస్తారు. 
పేపర్‌-2ను స్టాటిస్టిక్స్‌ సబ్జెక్ట్‌తో 100 ప్రశ్నలతో 200 మార్కులకు నిర్వహిస్తారు.
పేపర్‌-3ని జనరల్‌ స్టడీస్‌(ఫైనాన్స్‌ అండ్‌ ఎకనామిక్స్‌)తో 200 మార్కులకు 100 ప్రశ్నలతో నిర్వహిస్తారు.
అన్ని పోస్ట్‌ల అభ్యర్థులు పేపర్‌-1కు తప్పనిసరిగా హాజరు కావాలి.
పేపర్‌-2ను జూనియర్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ పోస్ట్‌ల అభ్యర్థులకు మాత్రమే నిర్వహిస్తారు.
పేపర్‌-3ని అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్ట్‌ల అభ్యర్థులకు నిర్వహిస్తారు.
మార్చి 2 నుంచి 7 వరకు....
టైర్ -2 పరీక్షలు మార్చి 2 నుంచి 7 వరకు జరగనున్నాయి. మార్చి 2,3,6,7 తేదీల్లో పేపర్ -1 పరీక్ష.. అలాగే మార్చి 4న పేపర్ - 2,3 పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎస్ఎస్‌సీ ప్రకటనలో పేర్కొంది.

Published date : 27 Feb 2023 03:18PM

Photo Stories