Skip to main content

17727 SSC CGL Jobs Notification 2024 Full Details : గుడ్‌న్యూస్‌.. 17,727 ఉద్యోగాల‌ భ‌ర్తీకి భారీ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. పూర్తి వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీకి భారీ నోటిఫికేష‌న్ విడుద‌లైంది.
SSC 17727 CGL Jobs Notification 2024

గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌-2024 నోటిఫికేషన్‌ను జూన్ 24వ తేదీ (సోమ‌వారం) స్థాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. 17727 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భ‌ర్తీకి ఈ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేశారు.

అర్హ‌త‌లు ఇవే..
ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టులవారీగా అదనపు విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి జూన్ 24వ తేదీ నుంచి జులై 24వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రెండంచెల (టైర్-1,టైర్-2) పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

వ‌య‌స్సు ఇలా.. :

01.08.2024 నాటికి కొన్ని పోస్టులకు 18-27 సంవత్సరాలు, కొన్ని పోస్టులకు 20-30, కొన్ని పోస్టులకు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. మరికొన్ని పోస్టులకు 18 - 32 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు :
రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, దివ్యాగులు, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 10-15 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఢిఫెన్స్ అభ్యర్థులకు 3- సంవత్సరాలు, ఢిఫెన్స్ అభ్యర్థులకు (డిసేబుల్డ్) - 8 సంవత్సరాలు, కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 40-45 సంవత్సరాల వరకు, ఒంటరి/విడాకులు తీసుకున్న మహిళలకు 35-40 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.

భ‌ర్తీ చేసే పోస్టులు ఇవే..
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్,  ఇన్‌స్పెక్టర్ (సీజీఎస్టీ & సెంట్రల్ ఎక్సైజ్),ఇన్‌స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్), ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్), అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, సబ్ ఇన్‌స్పెక్టర్ (CBI), ఇన్‌స్పెక్టర్ ( పోస్టల్ శాఖ), 
ఇన్‌స్పెక్టర్ - ఇన్‌కమ్ ట్యాక్స్, అసిస్టెంట్/అసిస్టెంట్ సూపరింటెండెంట్, ఇన్‌స్పెక్టర్ (నార్కోటిక్స్), ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ (CBIC), రిసెర్చ్ అసిస్టెంట్ (NHRC), డివిజనల్ అకౌంటెంట్ (కాగ్), సబ్ ఇన్‌స్పెక్టర్(NIA), సబ్ ఇన్‌స్పెక్టర్/ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ఎన్‌సీబీ), జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (స్టాటిస్టిక్స్), స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ (హాంఅఫైర్స్), ఆడిటర్ (కాగ్, సీజీడీఏ, etc.,), అకౌంటెంట్ (కాగ్, సీజీఏ, etc.,),  సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ (CGCA), పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్ (పోస్టల్), సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, ట్యాక్స్ అసిస్టెంట్

ఏదైనా డిగ్రీ. ఆడిట్ ఆఫీసర్/ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు సీఏ/ సీఎంఏ/ సీఎస్/ పీజీ డిగ్రీ (కామర్స్/ఎకనామిక్స్/బిజినెస్ స్టడీస్)/ఎంబీఏ (ఫైనాన్స్) అర్హత ఉండాలి.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం :

టైర్-1, టైర్-2 రాతపరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా.

జీతం : 
ఆయా పోస్టులను బట్టి నెలకు రూ.25,500ల నుంచి రూ.1,42,400 జీతం ఉంటుంది. ఇతర భత్యాలు అదనం.

ముఖ్యమైన తేదీలు తేదీలు ఇవే..
☛ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 24.06.2024. 
☛ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది : 24.07.2024 (23:00)
☛ ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది : 25.07.2024 (23:00)
☛ దరఖాస్తుల సవరణ : 10.08.2024 - 11.08.2024(23:00) వరకు
☛ టైర్-1 పరీక్ష తేదీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) : సెప్టెంబరు/అక్టోబరు, 2024.
☛ టైర్-2 పరీక్ష తేదీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) : డిసెంబరు, 2024.

SSC 17727 CGL Jobs Notification 2024 Full Details : 

Published date : 25 Jun 2024 08:35AM
PDF

Photo Stories