10th Class Exam Fees: ఎస్సెస్సీ పరీక్ష ఫీజు చివరి తేదీ ఇదే..
నవంబర్ 18వ తేదీ వరకు అపరాధ రుసుం లేకుండా చెల్లించొచ్చని, రూ.50 అపరాధ రుసుముతో డిసెంబర్ 2వ తేదీ వరకు, రూ.200 అపరాధ రుసుముతో డిసెంబర్ 12వరకు, రూ.500అపరాధ రుసుముతో డిసెంబర్ 21వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశముందని తెలిపారు.
ఒక్కో సబ్జెక్టు ఫీజు రూ.125 కాగా, గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులు మూడు సబ్జెక్టుల వరకు రూ.110, ఆపై సబ్జెక్టులకు రూ.125 చొప్పున చెల్లించాలని వెల్లడించారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2025 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
ఖమ్మం సహకారనగర్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యాన గత నెలలో నిర్వహించిన పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. జిల్లా నుంచి పదో తరగతి పరీక్షలకు 342మంది హాజరుకాగా 182మంది(53.22శాతం), ఇంటర్ పరీక్షల్లో 380మందికి 216మంది(56.84శాతం) ఉత్తీర్ణత సాధించారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
ఫలితాలను www. telangana openschool.org వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని డీఈఓ ఈ.సోమశేఖరశర్మ, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ మద్దినేని పాపారావు తెలిపారు. కాగా, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు కోసం ఈనెల 14నుంచి 20వ తేదీ వరకు వెబ్‌సైట్ లేదా మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇంటర్ ఒక సబ్జెక్టు రీ కౌంటింగ్‌కు రూ.400, పదో తరగతికై తే రూ.350, ఇంటర్, పదో తరగతి అభ్యర్థులు ఒక్కో సబ్జెక్ట్ రీ వెరిఫికేషన్, జవాబుపత్రం జిరాక్స్ కోసం రూ.1,200 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.