Skip to main content

Teachers: ‘సర్కారు’లో టీచర్ల కొరత.. తాత్కాలిక పద్ధతిలో భర్తీ

ఆసిఫాబాద్‌ రూరల్‌: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలతో విద్యార్థులకు నష్టం జరుగుతోంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల భర్తీ జరగడం లేదు.
Shortage of teachers in Government Schools

బదిలీలు, పదోన్నతులతో జిల్లా నుంచి అనేక మంది వెళ్లిపోగా.. మారుమూల ప్రాంతంలో పని చేసేందుకు కొత్తవారు మాత్రం ఆసక్తి చూపలేదు. ప్రాథమిక పాఠశాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. గతంలో విద్యార్థులు నష్టపోకుండా విద్యావలంటీర్లను నియమించేవారు.

ప్రస్తుత విద్యాసంవత్సరంలో అకాడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లను నియామకం ఇప్పటివరకు పూర్తికాలేదు. మరోవైపు డీఎస్సీ నియామక ప్రక్రియ సైతం పూర్తికాకపోవడంతో కొత్త టీచర్లు ఎప్పుడు ఉద్యోగాల్లో చేరుతారనే దానిపై స్పష్టత కరువైంది.

డీఎస్సీ ద్వారా 319 పోస్టులు భర్తీ

జిల్లావ్యాప్తంగా మొత్తం 704 ప్రభుత్వ పాఠశాలలు(స్థానిక సంస్థలు) ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 561, ప్రాథమికోన్నత పాఠశాలలు 83, ఉన్నత పాఠశాలలు 60 ఉన్నాయి. 2024– 25 విద్యా సంవత్సరంలో 37,948 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

జిల్లాలో అన్ని స్థాయిల్లో ఉపాధ్యాయ పోస్టులు 2455 ఉండగా.. ప్రస్తుతం 524 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పీజీ హెచ్‌ఎంలు 05, ఎస్జీటీలు 389, ఎస్‌ఏ(గణితం) 9, ఎస్‌ఏ(ఫిజికల్‌ సైన్స్‌) 12, ఎస్‌ఏ (సాంఘిక) 20, ఎస్‌ఏ(బయోసైన్స్‌) 12, ఎస్‌ఏ(ఇంగ్లిష్‌) 6, తెలుగు, హిందీ పండిత్‌ 29తోపాటు రిటైర్మెంట్‌తో మరో 47 ఖాళీలు ఏర్పడ్డాయి. ఇందులో డీఎస్సీ ద్వారా కేవలం 319 పోస్టులను మాత్రమే భర్తీ చేయనున్నారు. ఇటీవల బదిలీలు, పదోన్నతులతో చాలామంది స్కూల్‌ గ్రేడ్‌ టీచర్లు(ఎస్జీటీ) స్కూల్‌ అసిస్టెంట్లు(ఎస్‌ఏ)గా పదోన్నతి పొందారు.

చదవండి: Collector Badavath Santhosh: బోధనలో నూతన పద్ధతులు అవసరం

ఫలితంగా ప్రాథమిక పాఠశాలల్లో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. కొన్ని స్కూళ్లలో ఒక్కరూ కూడా లేరంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కాగజ్‌నగర్‌ మండలం అంకుసాపూర్‌ పాఠశాలలో ఇద్దరు టీచర్లు ఉంటే ఇద్దరూ బదిలీపై వెళ్లారు. అదే మండలం గొల్లగూడ స్కూల్‌లో రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యార్థులు నష్టపోకుండా విద్యాశాఖ అవరమైన చోటుకు 33 మందిని సర్దుబాటు చేసింది. అయితే సర్దుబాటు ఉత్తర్వులు అందినా కొంతమంది దూరప్రాంతాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

గిరిజన శాఖలో ఇలా..

ఇటీవల గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని ఆశ్రమ పా ఠశాలల్లో పని చేస్తున్న సీఆర్టీ(కాంట్రాక్ట్‌ రెసిడెన్షియ ల్‌ టీచర్స్‌)ల బదిలీల ప్రక్రియ చేపట్టారు.

158 ప్రాథమిక పాఠశాలలు, 48 ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 229 మంది స్కూల్‌ అసిస్టెంట్లు, 206 మంది ఎస్టీటీలను కొత్తస్థానాలకు బదిలీ చేశారు.

బదిలీలతోనే ఖాళీలు

ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులతో జిల్లాలో ఖాళీల సంఖ్య పెరిగింది. విద్యార్థులు నష్టపోకుండా చర్యలు చేపడుతున్నాం. విద్యార్థులు ఎక్కువ మంది ఉన్న చోటుకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తున్నాం.

– అశోక్‌, డీఈవో

తాత్కాలిక పద్ధతిలో భర్తీ

ఆసిఫాబాద్‌ మోడల్‌ స్కూల్‌లో ఇటీవల జరిగిన బదిలీలతో పీజీటీ పోస్టులు 9, టీజీటీ పోస్టులు 4 ఖాళీ అయ్యాయి. ఖాళీలను భర్తీ కోసం జిల్లా కలెక్టర్‌, డీఈవో దృష్టికి తీసుకెళ్లాం. వారి అనుమతితో ఉపాధ్యాయులను నియమించి విద్యార్థులు నష్టపోకుండా చూస్తాం.

– మహేశ్వర్‌, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌, ఆసిఫాబాద్‌ మోడల్‌ స్కూల్‌

మోడల్‌ స్కూళ్లలో భారీగా ఖాళీలు..

రాష్ట్ర ప్రభుత్వం 2013లో మోడల్‌ స్కూళ్లను ప్రారంభించగా అప్పటి నుంచి ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులకు బదిలీలు జరగలేదు. జిల్లాలో ఆసిఫాబాద్‌, సిర్పూర్‌(యూ)లో మోడల్‌ స్కూళ్లు ఉండగా.. 12 ఏళ్ల తర్వాత జరిగిన బదిలీలతో ఉపాధ్యాయులు, అధ్యాపకులు దాదాపు మొత్తం మంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. సిర్పూర్‌(యూ), ఆసిఫాబాద్‌ ఆదర్శ పాఠశాలల నుంచి 17 మంది రెగ్యులర్‌ ఉపాధ్యాయులు, అధ్యాకులు బదిలీలపై ఇతర ప్రాంతాలకు వెళ్లారు.

ఇద్దరు మాత్రమే కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాకు వచ్చారు. ప్రస్తుతం 15 పోస్టుల ఖాళీగా మారాయి. ఒక్క ఆసిఫాబాద్‌లోనే పీజీటీ తెలుగు, ఇంగ్లిష్‌, గణితం, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్‌, సివిక్స్‌, కామర్స్‌, ఎకనామిక్స్‌, టీజీటీ తెలుగు, ఇంగ్లిష్‌, గణితం, సైన్స్‌ పోస్టులు ఖాళీగా మారాయి. విద్యా సంవత్సరం మధ్యలో బోధకులు వెళ్లిపోవడంతో చదువులపై ప్రభావం చూపుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

జిల్లా కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌ రాష్ట్రంలోనే ఉత్తమ ఫలితాలు సాధిస్తుండటంతో ఇక్కడ ప్రవేశాలకు పోటీ ఉంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 807 మంది చదువుతున్నారు. చదువుతోపాటు క్రీడలు, ప్రయోగాలు, పోటీ పరీక్షల్లోనూ సత్తా చాటుతున్నారు. ఇలాంటి స్కూల్‌ను మధ్యలో వదిలివెళ్లడం బాధాకరమని ప్రిన్సిపాల్‌ అబ్దుల్‌ ఖలీల్‌ తెలిపారు. ఆసిఫాబాద్‌ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా మంగళవారం మహేశ్వర్‌ బాధ్యతలు స్వీకరించారు.

విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఇలా..

పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను నియమించాలని నిబంధనలు చెబుతున్నాయి. విద్యార్థులు 19లోపు ఒక టీచర్‌, 20 నుంచి 60 వరకు ఉంటే ఇద్దరు టీచర్లు, 61 నుంచి 90 వరకు ఉంటే ముగ్గు రు, 91 నుంచి 120 వరకు నలుగురు, 121 నుంచి 150 వరకు ఐదుగురు ఎస్జీటీలు, ఒక హెచ్‌ఎం, 201 నుంచి 240 వ రకు విద్యార్థులు ఉంటే హెచ్‌ఎం, ఆరుగురు ఎస్జీటీలు, 241 నుంచి 280 వరకు ఉంటే హెచ్‌ఎం, ఏడుగురు ఎస్జీటీలు, 281 నుంచి 320 వరకు ఎనిమిది మంది ఎస్జీటీలు, ఒకరు హెచ్‌ఎం, 321 నుంచి 360 వరకు ఉంటే తొమ్మిది మంది ఎస్జీటీలు, ఒక హెచ్‌ఎం, 361 నుంచి 400 వరకు విద్యార్థులు ఉంటే పది మంది ఎస్జీటీలు, ఒక హెచ్‌ఎం ఉండాలి.

Published date : 21 Sep 2024 04:05PM

Photo Stories