Skip to main content

Collector Badavath Santhosh: బోధనలో నూతన పద్ధతులు అవసరం

వెల్దండ: విద్యా బోధనలో నూతన పద్ధతులు అవలంభించాలని, ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాలు విద్యార్థులు సులువుగా అర్థం చేసుకునే విధంగా పరికరాలను ఉపయోగించాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు.
New methods of teaching news in telugu  Educational technology tools for effective teaching

సెప్టెంబ‌ర్ 20న‌ ఆయన వెల్దండలోని సాంఘిక, సంక్షేమ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో తాగునీరు, వర్షపు నీటి నిల్వ, మరుగుదొడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ వంటి సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు.

దీంతో స్పందించిన ఆయన ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్‌తో అంచనాలు రూపొందించి నివేదిక పంపించాలని ప్రిన్సిపల్‌కు సూచించారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి త్వరగా కృషిచేస్తామన్నారు. అనంతరం కలెక్టర్‌ తరగతి గదులను పరిశీలించి విద్యార్థినులతో మాట్లాడి వివిధ అంశాలపై ఆరాతీశారు.

చదవండి: Thieves Schools : ఈ ఊళ్ల‌ల్లో దొంగ‌ల బ‌డులు.. అచ్చం మామూలు పాఠశాలలాగే.. కానీ!

మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన భోజనం పెడుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం పీహెచ్‌సీని సందర్శించి.. వైద్యసేవలపై ఆరా తీశారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి చెప్పారు.

కార్యక్రమంలో తహసీల్దార్‌ కార్తీక్‌కుమార్‌, ప్రిన్సిపల్‌ స్వర్ణరత్నం, డాక్టర్‌ మంజుభార్గవి, రాంనర్సింహదేవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Published date : 21 Sep 2024 03:23PM

Photo Stories