IAS Vijay Wardhan Success Story: జీవితంలో ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోవద్దు... వరుసగా 35 సార్లు ఫెయిల్... చివరికి ఐఏఎస్ సాధించానిలా
ఏ పోటీ పరీక్ష రాసినా ఫలితం మాత్రం ఒకటే ఉండేది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు, ఎస్ఎస్‌సీ, యూపీఎస్సీ... ఇలా ఏ బోర్డు పరీక్ష పెట్టినా అతనికి వచ్చే ఫలితం మాత్రం ఫెయిల్. కానీ, ఎక్కడా అతను ఓటమిని ఒప్పుకోలేదు. ఏ ఒక్క రోజు నిరాశకు లోనవలేదు. తన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్నాడు. చివరికి తన లక్ష్యమైన ఐఏఎస్ సాధించాడు. అతనే విజయ్ వర్దన్. ఆయన సక్సెస్ స్టోరీ మీకోసం...
☛➤☛ ఈ రెండు అలవాట్లే.. నేను ఐఏఎస్ అయ్యేలా చేశాయ్.. కానీ..
హరియాణాలోని సిర్సా ప్రాంతం వర్ధన్ స్వగ్రామం. అక్కడే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశాడు. తర్వాత Electronics and Communication Engineering(ఈసీఈ)ని హిసార్‌లో (Hisar) పూర్తి చేశాడు. 2013లో బీటెక్ పూర్తి చేసిన తర్వాత విజయ్ తన లక్ష్యం ఐఏఎస్ అని నిర్దేశించుకున్నాడు. కానీ, హర్యాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎస్ఎస్ఎస్, యూపీఎస్సీ నిర్వహించే ప్రతి పరీక్షను రాసేవాడు. అలా 2014 నుంచి వరుసగా నాలుగేళ్లపాటు 35 పరీక్షలు రాశాడు. ఇందులో ఎస్ఎస్‌సీ సీజీఎల్ (SSC CGL), ఎల్ఐసీ (LIC), ఇస్రో (ISRO), సీఏపీఎఫ్ (CAPF) ఇలా అన్ని పరీక్షలకు అటెండ్ అయ్యేవాడు. కానీ, ఫలితం మాత్రం నిరాశే మిగిల్చేది.
☛➤☛ ఒక వైపు తండ్రి మరణం.. మరో వైపు కుటుంబంపై నిందలు.. ఈ కసితోనే చదివి డీఎస్పీ ఉద్యోగం కొట్టానిలా..
చేసిన తప్పులను ఎట్టి పరిస్థితుల్లో రిపీట్ చేయొద్దని బలంగా నిశ్చయించుకున్నాడు విజయ్ వర్దన్. 2018 నాటికి వరుసగా నాలుగు సార్లు సివిల్స్ పరీక్ష రాసి ఫెయిల్ అవడంతో ఈ సారి పట్టుదలగా చదివాడు. ఏ ఒక్క నిమిషాన్ని వేస్ట్ చేయకుండా.. ప్రతీ ఒక్క మార్కు ఇంపార్టెంటే అనుకుని తన ప్రిపరేషన్‌ను మళ్లీ మొదలుపెట్టాడు. ఈసారి అతని కష్టానికి ఫలితం దక్కింది. 2018లో విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో ఆల్ ఇండియా 104వ ర్యాంకు సాధించాడు.
తనకు వచ్చిన ర్యాంకు ఐపీఎస్ వచ్చింది. కానీ, తన లక్ష్యం ఐఏఎస్. 35 ఫెయిల్యూర్ల తర్వాత ఐపీఎస్ సాధించినందుకు ఆనందపడాలో లేక ఐఏఎస్‌కు అడుగు దూరంలో నిలిచిపోయినందుకు నిరాశ చెందాలో అర్థం కావడం లేదు వర్దన్‌కు. సరే ఏది అయితే అది అయ్యిందనుకున్నాడు. ఈ సారి ఇంకా బలంగా పట్టుదలతో చదవాలనుకున్నాడు. అటు ఐపీఎస్ శిక్షణ తీసుకుని ప్రొబెషన్‌లో ఉంటూనే మళ్లీ చదవడం ప్రారంభించాడు. 2021లో విడుదలైన ఫలితాల్లో తన చిన్ననాటి కలైన ఐఏఎస్ సాధించి శభాష్ అనిపించుకున్నాడు.
" వరుసగా 35 సార్లు ఫెయిలవడంతో ఇంక విజయం సాధించలేనేమో అనుకున్నా. స్నేహితులతో పాటు ప్రతి ఒక్కరు ఇంకెన్నాళ్లు ఇలా రాస్తూనే ఉంటావని హేళనగా మాట్లాడేవారు. కానీ, వారి మాటలే నాలో ఆత్మస్థైర్యాన్ని పెంచాయి. వైఫల్యాలు ఎదురైనప్పుడే మనం చేస్తున్న తప్పులు ఏంటో మనకు అర్థమవుతాయి. వాటిని సరిదిద్దుకుని ముందుకు వెళ్లాను. ఓర్పు, సహనంతో విజయం కోసం ఎదురుచూశా. ఇప్పుడు నా లక్ష్యం నెరవేరింది" అంటూ తన విజయం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు విజయ్ వర్దన్.