Skip to main content

Btech Student Jobs 2025 : రూ. 18 ల‌క్ష‌ల జీతంతో.. బీటెక్ విద్యార్థుల‌కు జాబ్స్‌...

సాక్షి ఎడ్యుకేష‌న్‌: బీటెక్ పూర్తైన‌ విద్యార్థుల‌కు ఇండియ‌న్ ఆర్మీలో భారీ వేత‌నంతో వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తోంది. 379 టెక్‌ పోస్టులకు SSC ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.
Btech Student Jobs 2025  B.Tech graduates job opportunities in Indian Army with high salaries  SSC recruitment notification for 379 technical posts

పెళ్లికాని పురుషులూ, మహిళలూ ఈ ఉద్యోగాల‌కు అర్హులు. ఇంటర్వ్యూతో నియామకాలుంటాయి. వీరికి ఏడాదికి రూ.18 లక్షల జీతం ఉంటుంది. ఈ ఉద్యోగాల‌కు ఆన్‌లైన్ ద్వారా ఫిబ్రవరి 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవ‌చ్చు. అక్టోబరు 1, 2025 నాటికి 20 నుంచి 27 ఏళ్లలోపు వ‌యోప‌రిమ‌తి ఉండాలి. 

ఖాళీలు ఇవే :

379. పురుషులకు 350, మహిళలకు 29

విద్యార్హత : 
సంబంధిత బ్రాంచీల్లో ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులు, ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ సైన్స్‌ ఖాళీలకు బీటెక్‌ (ఐటీ), ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులవారూ అర్హులే.
వయసు : అ

ఎంపిక విధానం ఇలా..
వ‌చ్చిన దరఖాస్తులను బీటెక్‌లో వ‌చ్చిన‌ మార్కులతో వడపోస్తారు. మంచి మార్కులు వ‌చ్చిన వారిని సెలక్షన్‌ కేంద్రాల్లో ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు. ఏపీ, తెలంగాణ అభ్యర్థులకు బెంగళూరులో ఇంట‌ర్వ్యూ ఉంటుంది. సైకాలజిస్ట్, గ్రూప్‌ టెస్టింగ్‌ ఆఫీసర్, ఇంటర్వ్యూ ఆఫీసర్‌ ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తారు. ఇవి రెండు దశల్లో ఐదు రోజులు కొనసాగుతాయి. తొలిరోజు స్టేజ్‌-1లో ఉత్తీర్ణులే తర్వాత‌ 4 రోజులు నిర్వహించే స్టేజ్‌-2 ఇంటర్వ్యూలో కొనసాగుతారు. ఇందులోనూ విజయవంతమైనవారికి వైద్య పరీక్షలు నిర్వహించి, శిక్షణకు తీసుకుంటారు. పూర్తి వివ‌రాల‌కు www.joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

శిక్షణ ఇలా : 
ఈ ఉద్యోగంకు ఎంపికైన వారికి..  ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీలో అక్టోబరు, 2025 నుంచి శిక్షణ మొదలవుతుంది. వ్యవధి 49 వారాలు ఉంటుంది. ఈ సమయంలో నెలకు రూ.56,100 స్టైపెండ్‌ చెల్లిస్తారు. 

లెఫ్టినెంట్‌ హోదాతో...
విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌ డిగ్రీని మద్రాస్‌ యూనివర్సిటీ అందిస్తుంది. వీరిని లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. వీళ్లు పదేళ్లు ఉద్యోగంలో కొనసాగవచ్చు. అనంతరం సంస్థ అవసరాలు, అభ్యర్థుల ఆసక్తుల ప్రకారం కొందరిని శాశ్వత విధుల్లోకి (పర్మనెంట్‌ కమిషన్‌) తీసుకుంటారు. మిగిలినవారికి మరో నాలుగేళ్లపాటు సర్వీస్‌ పొడిగిస్తారు. లెఫ్టినెంట్‌ విధుల్లో చేరినవారు రెండేళ్ల అనుభవంతో కెప్టెన్, ఆరేళ్ల సేవలతో మేజర్, 13 ఏళ్లు కొనసాగితే లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాకు చేరుకోవచ్చు. తొలి నెల నుంచే అన్నీ కలిపి సుమారు రూ.1.5 లక్షల వేతనం పొందవచ్చు.

Published date : 13 Jan 2025 03:52PM

Photo Stories