Skip to main content

Indian Army Notification 2025: గుడ్‌న్యూస్‌.. రూ. 56,000 జీతంతో ఆర్మీలో ఉద్యోగం.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

సైన్యంలో పనిచేయాలని ఎదురుచూస్తున్న వారి కోసం ఇండియన్ ఆర్మీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.  ఇండియన్‌ షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ స్కీమ్‌ 58వ కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అవివాహిత పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Apply now for the Indian Army NCC Special Entry 2025  Indian Army Notification 2025   Indian Army NCC Special Entry Scheme Notification 2025
Indian Army Notification 2025

కేటగిరీ వారీగా ఖాళీలు: ఎన్‌సీసీ పురుషులు–70, ఎన్‌సీసీ మహిళలు–06. ఈ రెండు విభాగాల్లోనూ 8 పోస్టులు యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు దక్కుతాయి.

అర్హత:  కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మూడు అకడమిక్‌ సంవత్సరాలు ఎన్‌సీసీ సీనియర్‌ డివిజన్‌ వింగ్‌లో కొనసాగి ఉండాలి. ఎన్‌సీసీ సి సర్టిఫికేట్‌లో కనీసం బిగ్రేడ్‌ పొంది ఉండాలి. యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు ఎన్‌సీసీ సి సర్టిఫికేట్‌ అవసరం లేదు.

వయసు: 01.07.2025 నాటికి 19 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

Government Job Notification: ఎలాంటి రాతపరీక్ష లేకుండానే ‍ప్రభుత్వ ఉద్యోగం

ఎంపిక విధానం: అప్లికేషన్‌ షార్ట్‌లిస్ట్, స్టేజ్‌–1, స్టేజ్‌–2 టెస్టులు, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

శిక్షణ, వేతనం: ఎంపికైన అభ్యర్థులకు ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడమీ చెన్నైలో 49 వారాల శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్‌ చెల్లిస్తారు. శిక్షణ పూర్తిచేసుకున్నవారికి పీజీ డిప్లొమా ఇన్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌ డిగ్రీని మద్రాస్‌ యూనివర్శిటీ ప్రదానం చేస్తుంది. వీరిని లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు.

Goodnews For TCS Employees: ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన TCS.. జీతాల పెంపుపై కీలక ప్రకటన

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: మార్చి 15, 2025.


వెబ్‌సైట్‌: https://www.joinindianarmy.nic.in/.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 18 Feb 2025 06:13PM

Photo Stories