Padmaja Kumari Parmar Success Story : రూ.50 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి మహారాణి.. అయినా కూడా ఇలాంటి పనులు చేస్తోంది..!
రాచరిక వ్యవస్థ మొత్తం అంతరించిపోయినప్పటికీ.. కొంతమంది పేర్లు మాత్రం ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. దీనికి కారణం వారు చేసిన సేవలే. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు ఉదయపూర్ మేవార్ వంశానికి చెందిన యువరాణి 'పద్మజ కుమారి పర్మార్' (Padmaja Kumari Parmar). ఇంతకీ ఈమె ఎవరు..? ఈమె చేసిన సేవలేంటి..? నికర ఆస్తుల విలువ ఎంత తదితర వివరాలను తెలుసుకుందాం.
ఉదయపూర్ వంశానికి చెందినవారిలో పద్మజ కుమారి పర్మార్ తనదైన ముద్ర వేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. రాజ వంశానికి చెందిన పద్మజ దాతృత్వం నేడు ఖండాంతరాలలో విస్తరించింది. 1969లో తన తాత జ్ఞాపకార్థం మహారాణా ఆఫ్ మేవార్ చారిటబుల్ ఫౌండేషన్‌ను స్థాపించింది. దీని ద్వారా మహిళల విముక్తి & విద్యను ప్రోత్సహించింది.
Baryl Vanneihsangi: 32 ఏళ్లకే ఎమ్మెల్యే అయిన అమ్మాయి.. ఇప్పటికే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పాపులర్..
హెచ్‌ఆర్‌హెచ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్..
పద్మజ కుమారి పర్మార్ తన పూర్వీకుల అడుగుజాడల్లోనే HRH గ్రూప్ ఆఫ్ హోటళ్లతో ముందుకు సాగుతోంది. హెచ్‌ఆర్‌హెచ్ గ్రూప్‌కు బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన పద్మజ తన అనుభవాలతో వీటిని ప్రపంచ స్థాయికి తీసుకువెళుతున్నారు.
పద్మజ కుమారి పర్మార్ ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలోని MS చద్దా సెంటర్ ఫర్ గ్లోబల్ ఇండియా & హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లోని గ్లోబల్ హెల్త్ అండ్ సర్వీస్ అడ్వైజరీ కౌన్సిల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో సలహా బోర్డులలో పనిచేస్తున్నారు.
పద్మజకు డాక్టర్ కుష్ పర్మార్‌తో వివాహం జరిగిన తరువాత బోస్టన్‌కు మకాం మార్చింది. ఆ తరువాత ఉదయపూర్‌లోని తన పూర్వీకుల ఇంటికి, యునైటెడ్ స్టేట్స్‌లో ఆమె కొత్త జీవితానికి మధ్య వారధిగా కొనసాగుతోంది. ఇందులో భాగంగానే ఈమె హెచ్‌ఆర్‌హెచ్ గ్రూప్ వ్యాపార ఉనికిని విస్తరిస్తోంది.
పద్మజ కుమారి పర్మార్ దాతృత్వ స్ఫూర్తితో అలఖ్ నయన్ మందిర్ ట్రస్టీగా, సేవా మందిర్ వంటి సంస్థల ద్వారా మహిళలను ఉద్ధరించడంలో పాత్ర పోషిస్తోంది. రూ.50 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి మహారాణిగా ఉన్న ఈమె ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తోంది. ఈమె తన వంశం కోసం మాత్రమే కాకుండా ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి కృషి చేస్తోంది.