Skip to main content

N.Vijayakumar: సివిల్‌ జడ్జి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తండా యువకుడు

హొసపేటె: విజయనగరం జిల్లా కేంద్రం హొసపేటె నుంచి 40 కిలోమీటర్ల దూరంలో హగరిబొమ్మనహళ్లి తాలూకాలోని ఆనేకల్‌ తండాకు చెందిన ఎన్‌.విజయ్‌కుమార్‌ ఇప్పుడు సివిల్‌ జడ్జి పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు.
N.Vijayakumar Passed Civil Judge Exam    N. Vijaykumar, Successful Civil Judge Exam Candidate

దీంతో ఆనేకల్‌ తండాలో ఆనందం నెలకొంది. అవును, భారతరత్న బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం తనను జడ్జి పరీక్ష రాయడానికి ప్రేరేపించింది. దీంతో ప్రేరణ పొంది పట్టుదలతో పరీక్ష రాసి మూడో ప్రయత్నంలో విజయం సాధించిన ఆయన తన ఆనందాన్ని పంచుకున్నారు. ఆనేకల్‌ తండాకు చెందిన బీ.నారాయణ నాయక్‌, మంజుల దంపతుల కుమారుడు విజయ్‌కుమార్‌ తండాలోని ప్రభుత్వ సీనియర్‌ ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. 10వ తరగతి వరకు వల్లభాపురలోని మొరార్జీ రెసిడెన్షియల్‌ పాఠశాలలో చదివారు. 

హగరిబొమ్మనహళ్లిలోని గంగావతి భీమప్ప కళాశాలలో పీయూసీ, గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఆయన బళ్లారిలోని వీఎస్‌ఆర్‌ లా కాలేజీ నుంచి ఎల్‌ఎల్‌బీలో ఉత్తీర్ణత సాధించారు. మూడుసార్లు న్యాయమూర్తి పరీక్షకు హాజరయ్యారు. ఈసారి పరీక్షలో ఉత్తీర్ణుడై న్యాయమూర్తిగా ఎదిగారు. ఆనేకల్‌ తండాలో 1,200 ఇళ్లు ఉన్నాయి. తండాలో నలుగురు న్యాయవాదులు ఉన్నారు. జడ్జి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన నేపథ్యంలో తమ పిల్లలను బాగా చదివించేందుకు మరింత చైతన్యం నింపారని తాండా వాసులు తెలిపారు.  

Santosh Lakshmi: ‘నాడు సర్పంచ్‌.. నేడు న్యాయమూర్తి’.. జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికైన మ‌హిళ‌

Published date : 27 Feb 2024 05:34PM

Photo Stories