Software Engineer Layoffs : షాకింగ్ న్యూస్.. ఇకపై ప్రోగ్రామర్లకు ఉద్యోగాలు ఉండవ్... దీని వల్లనే...!
కృత్రిమ మేధస్సు సాంకేతికత పెరుగుతున్న ప్రభావం గురించి లేవనెత్తిన ప్రశ్నకు కీర్తి వాసన్ సమాధానమిస్తూ.. కొత్త సాంకేతికతలు ఐటీ కంపెనీల సామర్థ్యాన్ని పెంచాయి. ఇది ఇంజనీరింగ్ రంగంపై భారీ ప్రభావాన్ని చూపిందని, రాబోయే కాలంలో పెద్ద మార్పులను మనం ఆశించవచ్చని అన్నారు. కృత్రిమ మేధస్సు సాంకేతికత ఉన్న ఉద్యోగ అవకాశాలను నాశనం చేసి, మానవులకు కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని ఆయన అన్నారు. దీని అర్థం రాబోయే కాలంలో.. IT రంగంలో ప్రోగ్రామర్లు లేదా టెస్టర్ల అవసరం ఉండదు. కానీ దీనికి బదులుగా పెద్ద సంఖ్యలో AI మోడళ్లకు శిక్షణ ఇవ్వగల శిక్షకుల అవసరం ఉంటుంది.
మెటా సీఈవో మార్క్ జూకర్‌బర్గ్ ఏఐ గురించి సంచలన విషయాలను...
ఇప్పటికే చాలా కంపెనీలు ఏఐని చాపకింద నీరులా పనిలో డిప్లాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అమెరికాకు చెందిన మెటా సీఈవో మార్క్ జూకర్‌బర్గ్ ఏఐ గురించి సంచలన విషయాలను బయటపెట్టారు. మధ్య స్థాయి సాఫ్ట్ వేర్ డెవలపర్ల విషయంలో కీలక కామెంట్స్ చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వీరి స్థానాన్ని సమర్థవంతంగా భర్తీ చేయగలదని వెల్లడించారు. కోడింగ్ చేసే ఐటీ ఉద్యోగుల భవితవ్యాన్ని ఏఐ పూర్తిగా మార్చేయగలదని, వారి ఉద్యోగ అవకాశాలను మాయం చేస్తుందనే తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
➤☛ Warren Buffett : వారసుడిని ప్రకటించిన దిగ్గజ ఇన్వెస్టర్.. ఎవరు??
ఈ క్రమంలో 2025 గురించి కీలక అప్ డేట్ ఇచ్చారు. ఏడాది చివరి నాటికి మెటా సహా ప్రపంచంలోని ఇతర టెక్ కంపెనీలలో ప్రస్తుతం కోడింగ్ చేస్తున్న మిడ్-లెవల్ ఇంజనీర్‌లను సమర్థవంతంగా ఏఐ భర్తీ చేయగలదని పేర్కొన్నారు. ఒక విధంగా కంపెనీ ఏఐ వినియోగంలో మరింత ముందుకు సాగనున్నట్లు మెటా సీఈవో వెల్లడించారు. అయితే ఈ చర్య సమీప భవిష్యత్తులో కంపెనీలో మరిన్ని లేఆఫ్స్ కి దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే టెక్ కంపెనీలు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌ను ఎలా చేరుకుంటాయనే దానిపై ఇది పెద్ద మార్పును సూచిస్తుంది.
ఆరెంకల జీతం పొందుతున్న..
ప్రస్తుతం మెటా తన ఆధీనంలో ఉన్న వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి యాప్ లలో ఏఐ కోడింగ్ చేసే స్థితికి చేరుకున్నట్లు మార్క్ పేర్కొన్నారు. ఇది కంపెనీలో ఆరెంకల జీతం పొందుతున్న మధ్యస్థాయి టెక్కీలకు శాపంగా మారనుందని తెలుస్తోంది. అయితే దీనివల్ల కంపెనీకి గణనీయంగా ఖర్చులు తగ్గనున్నట్లు మెటా యాజమాన్యం భావిస్తోంది. అయితే ఇప్పటికే గూగుల్, ఐబీఎం వంటి టాప్ టెక్ దిగ్గజాలు ఏఐపై స్పష్టమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్న సంగతి తెలిసిందే. కంపెనీలు ఒక వంతుకుపైగా పనిని ఏఐ సాయంతో పూర్తి చేస్తున్న వేళ మెటా కూడా అదే దారిలో వెళుతోంది. ఇది సాంప్రదాయ కోడింగ్ ఉద్యోగాలను తొలగించగలదు.
రానున్న కాలంలో ఏఐ నిర్వహించలేని సంక్లిష్ట సమస్యలను మాత్రమే ఇంజనీర్లు పరిష్కరిస్తారని తెలుస్తోంది. మెటా దాని ఏఐ ప్రయాణంలో ఒంటరిగా లేదు. ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ అయిన క్లార్నా కూడా ఏఐ-ఆధారిత ఆటోమేషన్‌కు మద్దతునిచ్చింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల మాతృ సంస్థ మెటా.. తక్కువ పనితీరు కనబరిచిన సుమారు 3,600 మంది ఉద్యోగులను తొలగించింది. మార్క్ ఏఐ గురించి కీలక కామెంట్స్ చేసిన సమయంలోనే ఉద్యోగుల తొలగింపులకు సంబంధించిన కీలక ప్రకటన రావటం ఆందోళనలు పెంచుతోంది.
Tags
- software engineer layoffs due to ai technology
- AI Technology
- ai technology problems
- it jobs layoffs due to ai technology
- it jobs layoffs due to ai technology news in telug
- tcs ceo krithivasan
- tcs ceo krithivasan news
- tcs ceo krithivasan news in telugu
- TCS ceo krithivasan says AI
- tcs ceo krithivasan says ai technology
- software programmers layoffs due to ai technology
- software programmers layoffs due to ai technology news in telugu
- software programmers layoffs due to ai technology news telugu
- bad news software programmers layoffs due to ai technology