Skip to main content

NEET 2023 Ranker Success Story : కాశీ పురోహితుని కుమారుడు.. రోజూ గంగా హారతి ఇస్తూ.. నీట్ ర్యాంకు సాధించిన విభూ ఉపాధ్యాయ

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్ర‌తీ ఏడాది నీట్ నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. మెడిసిన్ చ‌ద‌వాలి అని క‌ల‌లు క‌నే యువ‌త నీట్‌లో మంచి ర్యాంకు సాధించి దేశంలోనే అత్యుత్త‌మ కాలేజీలో విద్య‌న‌భ్య‌శించాల‌ని క‌ల‌లు కంటుంటారు.
విభూ ఉపాధ్యాయ
విభూ ఉపాధ్యాయ

ఇందుకోసం రేయింబ‌వ‌ళ్లు నిద్రాహారాలు మానేసి మ‌రీ చ‌దువుతుంటారు.

NEET 2023 Ranker Success Story : క‌శ్మీరీ క‌వ‌ల‌లు... నీట్‌లో అద‌రగొట్టారు...వీరి విజ‌యం ప్ర‌తి ఒక్క‌రికి స్ఫూర్తిదాయ‌క‌మే..!

మొద‌టి ప్ర‌య‌త్నంలో నీట్ ర్యాంకు సాధించాలి అంటే ఈ మాత్రం క‌ష్టం త‌ప్ప‌నిస‌రి. అయితే ఫ‌స్ట్ సారి ర్యాంకు సాధించ‌ని వారు లాంగ్ ట‌ర్మ్ కోచింగ్ కూడా వెళుతుంటారు. కానీ, చ‌దువుతో పాటు ప్ర‌తీ రోజు గంగాహార‌తి ఇచ్చే ఓ పురోహితుడు నీట్‌లో మెరిశాడు. ఆ విశేషాలు ఇక్క‌డ తెలుసుకుందాం.!

Ganga Aarti
Ganga Aarti

ఉత్తరప్రదేశ్‌లోని కాశీలోగల భాగీరథ ఘాట్‌ వద్ద 2019 నుంచి ప్రతిరోజూ సాయం సమయాన గంగామాతకు హారతి ఇవ్వడంతో పాటు ‘నీట్‌’కు ప్రిపరేషన్‌ కొనసాగించిన విభూ ఉపాధ్యాయ మొదటి ప్రయత్నంలోనే నీట్‌ పరీక్షను క్రాక్‌ చేశాడు. ఈ సందర్భంగా విభు మీడియాతో మాట్లాడుతూ తాను 2019 నుంచి గంగామాతకు సేవ చేస్తున్నానని చెప్పాడు. 

NEET UG Exam 2023 Question Paper With Key : ముగిసిన నీట్ ఎగ్జామ్‌.. కీ కోసం క్లిక్ చేయండి

NEET

ఒక వైపు చదువుకుంటూనే మరోవైపు మహాహారతి కార్యక్రమంలో పాల్గొంటూ వచ్చానని తెలిపాడు. ఈరోజు తాను గంగామాత ఆశీర్వాదంతోనే నీట్‌లో ఉత్తీర్ణత సాధించానని తెలిపారు. ఇన్నాళ్లూ గంగామాతకు ఏ విధంగా భక్తశ్రద్ధలతో హారతి ఇచ్చానో అదే విధంగా ఇకపై సమయం దొరికినప్పుడల్లా గంగా మాతకు సేవ చేస్తాననని అన్నారు. ఇలా చేస్తేనే తన మనసుకు ప్రశాంతత లభిస్తుందని అన్నాడు. 

NEET 2023 Top 10 Rankers : నీట్‌-2023 ఫ‌లితాల్లో ఫ‌స్ట్ ర్యాంక‌ర్ మ‌న కుర్రాడే.. టాప్ 10 ర్యాంక‌ర్స్ వీరే.. ఈ సారి మాత్రం..

NEET

తాను ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూనే నీట్‌ పరీక్షకు ప్రిపేర్‌ అవుతూ వచ్చానన్నాడు. తన విజయంలో తన సోదరుడు హర్షిత్‌ భాగస్వామ్యం కూడా ఉందన్నారు. ఈ సందర్భంగా విభు తల్లి సునీత శర్మ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల చదువుసంధ్యలపై దృష్టి పెట్టాలి. అప్పుడే వారు మంచి ఫలితాలు సాధించగలుగుతారు. 

➤☛ NEET Cut-off Ranks 

కేవలం 8 నెలల పాటు సాగించిన కృషితోనే విభు నీట్‌ పరీక్షలో 662 మార్కులు సాధించి అద‌ర‌గొట్టాడు. విభు తండ్రి హరేంద్ర ఉపాధ్యాయ గంగాహారతి సేవా సమితి భాగీరథ ఘాట్‌ సభ్యుడు. కుమారుడి విజయం గురించి ఆయన మాట్లాడుతూ గంగామాత కృపతోనే తన కుమారుడు నీట్‌లో ర్యాంకు సాధించాడన్నారు.

Published date : 17 Jun 2023 01:29PM

Photo Stories