Skip to main content

NEET 2023 Top 10 Rankers : నీట్‌-2023 ఫ‌లితాల్లో ఫ‌స్ట్ ర్యాంక‌ర్ మ‌న కుర్రాడే.. టాప్ 10 ర్యాంక‌ర్స్ వీరే.. ఈ సారి మాత్రం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ప్రవేశ పరీక్ష ఏదైనా టాప్‌ ర్యాంకులు కొల్లగొట్టడమే పనిగా పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు. తాజాగా విడుద‌ల చేసిన‌ నీట్ ఫ‌లితాల‌లోనూ ప్రభంజనం సృష్టించారు.
NEET-UG 2023 Toppers Prabanjan J and Bora Varun Chakravarthi Telugu news
NEET-UG 2023 Toppers Prabanjan J and Bora Varun Chakravarthi

దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సు­ల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌ యూజీ–2023 ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌ విజయకేతనం ఎగురవేసింది. రాష్ట్రానికి చెందిన బోర వరుణ్‌ చక్రవర్తి అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంకు సాధించి రికార్డు సృష్టించాడు. 99.99 పర్సంటైల్‌తో దుమ్ము లేపాడు. అలాగే తమిళనాడుకు చెందిన ప్రభంజన్‌కు ఆలిండియా ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించారు. 720 మార్క్‌లతో ఇరువురికీ సంయుక్తంగా ఫస్ట్‌ ర్యాంక్‌ దక్కింది.

➤☛ NEET(UG)-2022 Andhra Pradesh State Quota MBBS Cutoff Ranks

నీట్‌కు హాజరైన 28,38,596 మందికి గానూ.. 11,45,976 మంది అభ్యర్ధులు అర్హత సాధించారు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం 20 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 499 నగరాలు, పట్టణాల్లో నీట్ నిర్వహించిన విషయం తెలిసిందే. జూన్‌ 4న ప్రిలిమినరీ ఆన్సర్‌ కీని విడుదల చేసిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ).. దీనిపై జూన్‌ 6వరకు విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది.

మొత్తం 13 భాషల్లో నిర్వహించిన నీట్‌ యూజీ పరీక్షను ఇంగ్లిష్‌లో అత్యధికంగా 16,72,914 మంది, హిందీలో 2,76,180 మంది రాయగా, తెలుగులో 1,295 మందే రాశారు. హిందీ, ఇంగ్లిష్‌ తర్వాత గుజరాతీ (53,027), బెంగాలీ (43,890), తమిళం (30,536)లో అత్యధికులు పరీక్ష రాశారు.

➤☛ NEET Cutoff Ranks: MBBS Management Quota Last Ranks 2021-22 in AP Medical Colleges

అర్హ‌త సాధించిన వారు వీరే..
జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ మే 7న దేశవ్యాప్తంగా 499 నగరాల్లోని 4,097 కేంద్రాల్లో నిర్వహించిన ఈ ప‌రీక్ష‌కు 20,38,596 మంది పరీక్షకు హాజరయ్యారు.. హాజరైన అభ్యర్థుల్లో 11,45,976 మంది (56.12%) అర్హత సాధించారు. తెలంగాణ నుంచి పరీక్ష రాసిన 72,842 మందిలో 42,654 (58.55%), ఏపీ నుంచి హాజరైన 68,578 మందిలో 42,836 (62.46%) మంది అర్హత సాధించారు. 

టాప్‌-50 ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు టాప్‌లో..
టాప్‌-50 ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు ఏడుగురు ఉండగా, వారిలో అయిదుగురు ఆంధ్రప్రదేశ్‌ వారే. వీరిలో వరుణ్‌ చక్రవర్తి (1, ఆంధ్రప్రదేశ్‌), కాంచాని గేయంత్‌ రఘురాంరెడ్డి (15, తెలంగాణ), యల్లంపల్లి లక్ష్మీ ప్రవర్ధన్‌రెడ్డి (25, ఆంధ్రప్రదేశ్‌), వంగీపురం హర్షిల్‌సాయి (38, ఆంధ్రప్రదేశ్‌), కణి యశశ్రీ (40, ఆంధ్రప్రదేశ్‌), కల్వకుంట్ల ప్రణతిరెడ్డి (45, ఆంధ్రప్రదేశ్‌), జాగృతి బోడెద్దుల (49, తెలంగాణ) ఉన్నారు.

Check NEET UG 2023 Question Paper with Key (Held on 07.05.2023)

మహిళల కేటగిరీలో కణి యశశ్రీ 6వ ర్యాంకు (జాతీయ ర్యాంకు 40), కల్వకుంట్ల ప్రణతిరెడ్డి 9 (జాతీయ ర్యాంకు 45), జాగృతి బోడెద్దుల 10 (జాతీయ ర్యాంకు 49), గంధమనేని గిరివర్షిత 11 (జాతీయ ర్యాంకు 51), లక్ష్మీరష్మిత గండికోట 12 (జాతీయ ర్యాంకు 52), గిలడ ప్రాచి 17 ర్యాంకు (జాతీయ ర్యాంకు 65)వ సాధించారు. ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో మొదటి ర్యాంకు వై.లక్ష్మీప్రవర్ధనరెడ్డి (జాతీయర్యాంకు 25)

ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి..
కాగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఈ ఏడాది 69,690 మంది నీట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 68,578 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 62.46 శాతం అంటే 42,836 మంది అర్హత సాధించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి అర్హత శాతం కొంత మేర పెరిగింది. 2022లో 65,305 మంది పరీక్ష రాయగా 61.77 శాతం 40,344 మంది అర్హత సాధించారు.

తెలంగాణ నుంచి..
తెలంగాణలో 72,842 మంది పరీక్ష రాశారు. వీరిలో 58.55 శాతం అంటే 42,654 మంది అర్హత సాధించారు. కాగా ఆల్‌ ఇండియా కోటాలో 15 శాతం సీట్లకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌(డీజీసీఏ) కౌన్సెలింగ్‌ నిర్వహిస్తుందని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. డీజీసీఏ సూచనల మేరకు అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన సీట్లకు రాష్ట్రాల్లో భర్తీ చేపడతారు.  

➤☛ NEET Cut-off Ranks 

నా ల‌క్ష్యం ఇదే.. : బోర వరుణ్‌ చక్రవర్తి, నీట్‌ ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకర్‌

Bora Varun Chakravarthi Neet top 1st ranker

  మాది పోలాకి మండలం తోటాడా గ్రామం. నాన్న బోర రాజేంద్ర నాయుడు నరసన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, అమ్మ రాజ్యలక్ష్మి తోటాడలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. నీట్‌లో మంచి ర్యాంకు వస్తుందనుకున్నా. అయితే నంబర్‌వన్‌ స్థానాన్ని కైవసం చేసుకుంటానని అనుకోలేదు. నా ప్రాథమిక విద్యాభ్యాసం నరసన్నపేటలోని పూర్తి చేశా. 8వ తరగతి నుంచి కార్పొరేట్‌ స్కూల్, కళాశాలల్లో చదివాను. ఇంటర్మీడియెట్‌లో 987 మార్కులు వచ్చాయి. న్యూఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్‌ చదువుతా.

NEET 2023 Top Rankers Details :

NEET Toppers 2023

NEET AIR

Candidate’s Name Gender Category Marks State
1 PRABANJAN J Male General 720 TAMIL NADU
1 BORA VARUN CHAKRAVARTHI Male OBC- NCL 720 ANDHRA PRADESH
(Central List)
3 KAUSTAV BAURI Male SC 716 TAMIL NADU
4 PRANJAL AGGARWAL Female General 715 PUNJAB
5 DHRUV ADVANI Male General 715 KARNATAKA
6 SURYA SIDDHARTH N Male OBC- NCL 715 TAMIL NADU
(Central List)
7 SHRINIKETH RAVI Male General 715 MAHARASHT RA
8 SWAYAM Male General 715 ODISHA
SHAKTI TRIPATHY
9 VARUN S Male OBC- NCL 715 TAMIL NADU
(Central List)
10 PARTH KHANDELWAL Male General 715 RAJASTHAN
11 ASHIKA AGGARWAL Female General 715 PUNJAB
12 SAYAN PRADHAN Male General 715 WEST BENGAL
13 HARSHIT BANSAL Male General 715 DELHI (NCT)
14 SHASHANK KUMAR Male General 715 BIHAR
15 KANCHANI GEYANTH RAGHU RAM REDDY Male General 715 TELANGAN A
16 SHUBHAMM BANSAL Male General 715 UTTAR PRADESH
17 BHASKAR KUMAR Male General 715 WEST BENGAL
18 DEV BHATIA Male General 715 GUJARAT
19 ARNAB PATI Male General 715 WEST BENGAL
20 SHASHANK SINHA Male OBC- NCL 712 BIHAR

 

(Central List
neet ug top rankers telugu news 2023
Published date : 14 Jun 2023 03:32PM

Photo Stories