Webinar : సివిల్స్, గ్రూప్-1 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? వారికోసం ప్రత్యేకంగా..
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్న పలు అంశాలపై ఈ వెబ్‌నార్‌లో చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్లు పాల్గొనున్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
కార్యక్రమానికి హాజరయ్యే ముఖ్య అతిథులు:
1. తమ్మ కోటి రెడ్డి
ప్రొఫెసర్, డీన్ ICFAI, హైదరాబాద్ స్కూల్ ఆఫ్ సోషన్ సైన్సెస్
మాట్లాడబోయే అంశం: భారతదేశంలో వ్యవసాయ సంక్షోభం
భారతదేశం ఎదుర్కొంటున్న వ్యవసాయ సంక్షోభంపై ప్రొఫెసర్ కోటిరెడ్డి సవివరమైన విశ్లేషణను అందిస్తారు. చిన్న, సన్నకారు రైతులు ఎదుర్కొనే సవాళ్లు, వ్యవసాయ ఆధునీకరణ విధానాలు, వ్యవసాయ రంగానికి మెరుగైన ఆర్థిక మద్ధతు వంటి పలు అంశాలపై ఈయన చర్చిస్తారు.
2. ఎస్. పుట్టస్వామయ్య
ఎకనామిక్స్ ప్రొఫెసర్, బెంగళూరు యూనివర్సిటీ
మాట్లాడబోయే అంశం: పేదరికం, అసమానత, మరియు నిరుద్యోగం
భారతదేశంలోని నిరుద్యోగం, అసమానత వంటి సామాజిక ఆర్థిక సమస్యలపై ప్రొఫెసర్ పుట్టస్వామయ్య చర్చిస్తారు. నిరుద్యోగాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఏం చేయాలి? నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించేందుకు ఎలాంటి విధానాలు పాటించాలి?వంటి అంశాలపై మాట్లాడతారు.
3. వేపూర్ శిరిషా
రాపోర్టర్,ఆర్థికశాస్త్ర విభాగం, హైదరాబాద్ యూనివర్సిటీ
వ్యవసాయ సంక్షోభం,పేదరికం మరియు నిరుద్యోగం వంటి పై అంశాలపై జరిగిన చర్చలపై వేపూర్ శిరిషా సమగ్ర విశ్లేషణను అందిస్తారు.
ముఖ్య సమాచారం
సాక్షి ఎడ్యుకేషన్ వెబ్‌నార్
తేది: అక్టోబర్ 26
సమయం: మధ్యాహ్నం 4:30 – 6:00వరకు
టాపిక్: భారతదేశంలోని ఆర్థిక సవాళ్లు- అవకాశాలు
వెబ్‌నార్ లింక్: http://alturl.com/f2osp
మీటింగ్ ఐడీ: 872 1760 8417
పాస్‌వర్డ్: sakshi
Tags
- Online webinar
- sakshieducation
- sakshieducation.com
- Students
- SAKSHI EDUCATION WEBINAR
- Webinar Series
- Competitive Exams
- Economic Challenges in India
- Civil Services Preparation
- Group-1 exam tips
- Indian economy discussion
- Competitive exam coaching
- Economic issues for exams
- Exam preparation guidance
- Indian economy analysis