NEET – 2023: డాక్టర్ కావాలంటే నిత్య విద్యార్థి కావాలి.. వైస్ చాన్సలర్ కోరుకొండ బాబ్జీ
ఏటా తమ విద్యా సంస్థ నుంచి 200 మందికి తగ్గకుండా మెడికల్ సీట్లు సాధిస్తున్నారని చెప్పారు. ఈ విద్యా సంవత్సరం కూడా 300 సీట్లు వచ్చే అవకాశం ఉందని అన్నారు. వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ చాన్సలర్ కోరుకొండ బాబ్జీ మాట్లాడుతూ, ఇంటర్ వరకూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోద్బలంతో చదువుతారని, అదే ఎంబీబీఎస్‌కు వచ్చేసరికి విద్యార్థి సొంతంగా నేర్చుకోవలసి ఉంటుందని అన్నారు.
Nursing Job : నర్సింగ్ ట్యూటర్స్‌గా ప్రమోషన్లు
ఎంబీబీఎస్‌లో పుస్తకాలు చదవడంతో పాటు ప్రాక్టికల్స్ చేస్తూ నిరంతర విద్యార్థిగా ఉండాలని అన్నారు. వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ జాయింట్ రిజిస్ట్రార్ వీవీ సుబ్బారావు మాట్లాడుతూ, కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు తమకు నచ్చిన అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలను ఒకేసారి ఎంపిక చేసుకోవాలని, ర్యాంకు ఆధారంగా సీటు కేటాయిస్తారని చెప్పారు. కౌన్సెలింగ్‌పై తల్లిదండ్రులు, విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. సాగర్ హస్పిటల్ వైద్యుడు పి.రవికిరణ్ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థీ కష్టపడి ఎంబీబీఎస్‌తో పాటు ఎండీ చేయాలని సూచించారు. శశి అకాడమిక్ డైరెక్టర్ శేషుబాబు మాట్లాడుతూ, కళాశాల విద్య వరకూ విద్యార్థుల ఒత్తిడిని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు షేర్ చేసుకుంటారని, ఎంబీబీఎస్‌లో వారే చూసుకోవాలని అన్నారు.