Skip to main content

Employees: నైపుణ్యాభివృద్ధిలో హెచ్‌ఆర్‌ కీలకం

సాక్షి, విశాఖపట్నం: ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధిలో హెచ్‌ఆర్‌ నిపుణుల పాత్ర కీలకమని సీఐఐ ఏపీ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ వి.మురళీకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని ఓ హోటల్‌లో హెచ్‌ఆర్‌ కాంక్లేవ్‌ పేరిట సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. కోవిడ్‌ అనంతరం ఏడాది తర్వాత ఐటీ సంస్థల మానవ వనరుల నిపుణులు తమ ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పిస్తున్నారన్నారు.
మాట్లాడుతున్న డాక్టర్‌ మురళీకృష్ణ
మాట్లాడుతున్న డాక్టర్‌ మురళీకృష్ణ

● సీఐఐ ఏపీ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ మురళీకృష్ణ

Also read: WIPO Fellowship: AU రీసెర్చ్‌ అధికారికి అంతర్జాతీయ ఫెలోషిప్‌

వారిలో నైపుణ్యాభివృద్ధి, వైవిధ్యం, భద్రతలకు వీలుగా హెచ్‌ఆర్‌ నిపుణులు కృషి చేస్తున్నారని చెప్పారు. సీఐఐ పూర్వ చైర్మన్‌ డి.రామకృష్ణ మాట్లాడుతూ వివిధ కంపెనీలు వేగంగా మార్పులను ఎదుర్కొంటున్నం దున వాటి నిర్వాహకులు సంస్థల అభివృద్ధికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారని చెప్పారు. ఇందులో మార్పు, సంస్కృతి విజయానికి కీలకమన్నారు. ప్యారడైజ్‌ ఫుడ్‌కోర్టు ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ, సీఈవో గౌతమ్‌ గుప్తా మాట్లాడుతూ పని సంస్కృతి చాలా ముఖ్యమని, కాలానుగుణంగా సందర్భానుసారం ఉద్యోగులను ప్రసంశించడం, వారిని గుర్తించడం మంచి ఫలితాలనిస్తుందన్నారు. సీఐఐ విశాఖ హెచ్‌ఆర్‌ ప్యానెల్‌ కన్వీనర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ పీఎస్‌ ఠాగూర్‌ మాట్లాడుతూ సానుకూల దృక్పథం మంచి ఫలితాలను, సత్సంబంధాలను పెంపొందిస్తుదన్నారు.

Also read: National Education Policy: అత్యంత ఆధునిక సౌకర్యాలతో వర్చువల్ ఓపెన్ స్కూల్‌ ప్రారంభం

వ్యాపార ప్రక్రియల్లో సాంకేతికతను వినియోగించుకోవడం చాలా ముఖ్యమన్నారు. హైదరాబాద్‌ టీసీఎస్‌ హెచ్‌ఆర్‌ హెడ్‌ శ్రీకాంత్‌ సూరంపూడి మాట్లాడుతూ తమ హెచ్‌ఆర్‌ టెక్నాలజీని ఎలా డిజైన్‌ చేయాలి, ఎలా ఉపయోగించాలి అనే అంశాల్లో ప్రజలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. వ్యాపార విజయానికి ఉద్యోగి అనుభవం కీలకమని ఆయా సంస్థలు తెలుసుకుంటున్నాయన్నారు. సదస్సులో పీపుల్‌ అండ్‌ కల్చర్‌ హెడ్‌ సాలినీ నాయర్‌, అమేడియస్‌ సాఫ్ట్‌వేర్‌ ల్యాబ్స్‌ ఇండియా ప్రతినిధి అజిత్‌నందకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Also read: Jagananna Videshi Vidya Deevena: విద్యాదీవెన పథకానికి అర్హత.. ధన్యవాదాలు తెలిపిన సాయికిరణ్‌

Published date : 29 Jul 2023 05:07PM

Photo Stories