Job Mela: ట్రైనీ టెక్నీషియన్లగా ఉద్యోగాలు
Sakshi Education
అనంతపురం ఎడ్యుకేషన్: నగరంలోని ఎంజీఎం స్ప్రింగ్స్‌లో ఖాళీగా ఉన్న ట్రైనీ టెక్నీషియన్ల పోస్టులకు మే 6న ఉదయం 10 గంటలకు అనంతపురంలోని ప్రభుత్వ ఐటీఐలో జాబ్‌మేళా నిర్వహించనున్నారు.
ఈ మేరకు ప్రభుత్వ బాలుర ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ రామమూర్తి మే 2న ఓ ప్రకటన విడుదల చేశారు. ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్ ట్రేడుల్లో ఉత్తీర్ణులైన వారు అర్హులు. ఎంపికైన వారికి ఏడాది పాటు శిక్షణ ఉంటుంది.
శిక్షణ సమయంలో మొదటి మూడు నెలలు ర. 10 వేలు, తర్వాత 9 నెలలు ర.11 వేలు చొప్పున చెల్లిస్తారు. ఆ తర్వాత శాశ్వత ఉద్యోగం కల్పిస్తారు. పూర్తి వివరాలకు 96189 16029లో సంప్రదించవచ్చు.
Published date : 03 May 2024 04:03PM