Skip to main content

WIPO Fellowship: AU రీసెర్చ్‌ అధికారికి అంతర్జాతీయ ఫెలోషిప్‌

ఏయూ క్యాంపస్‌: ఆంధ్ర విశ్వవిద్యాలయం డీపీఐఐటీ–ఐపీఆర్‌ చైర్‌లో రీసెర్చ్‌ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్‌ అనింధ్య రాయ్‌ చౌదరి ప్రతిష్టాత్మక వరల్డ్‌ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ ఆర్గనైజేషన్‌(డబ్ల్యూఐపీవో) ఫెలోషిప్‌కి ఎంపికయ్యారు.
అనింధ్యరాయ్‌ని అభినందిస్తున్న వీసీ ప్రసాదరెడ్డి
అనింధ్యరాయ్‌ని అభినందిస్తున్న వీసీ ప్రసాదరెడ్డి

ఈ సంస్థ ఐపీ సేవలు, ఐపీ పాలసీ, సమాచారం, సహకారం తదితర అంశాలలో పని చేస్తోంది. సౌత్‌ ఆఫ్రికాకు చెందిన నేషనల్‌ ఐపీ మేనేజ్‌మెంట్‌ ఆఫీస్‌ ఈ నెల 31 నుంచి వచ్చేనెల 4వ తేదీ వరకు డర్బన్‌లో నిర్వహించే ప్రత్యేకమైన ప్రొఫెషనల్‌ డెవలప్‌మెంట్‌ ప్రొగ్రాంలో ఈ రీసెర్చ్‌ ఫెలో సాధించిన డాక్టర్‌ అనింధ్య రాయ్‌ చౌదరి పాల్గొంటారు. ప్రపంచ వ్యాప్తంగా 19 దేశాల నుంచి మేధో హక్కుల నిపుణులు ఈ సదస్సులో భాగస్వాములవుతున్నారు. ఈ సందర్భంగా అనింధ్యరాయ్‌ని ఏయూ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి తన కార్యాలయంలో అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐపీఆర్‌ చైర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ హనుమంతు పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు.

Also read: AP Schools: నాడు–నేడు అభివృద్ధి పనుల పరిశీలన: కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌

Published date : 28 Jul 2023 04:21PM

Photo Stories