Skip to main content

ప్రతిభ చాటిన విద్యార్థినులు

కొరుక్కుపేట: కూరగాయలతో కళాఖండాలు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే ఫేస్‌ పెయింటింగ్‌లు, వృత్తినైపుణ్యాన్ని పెంచే మొబైల్‌కేస్‌ డిజైన్‌లతో ఎస్‌కేపీసీ విద్యార్థినులు ప్రతిభను చాటుకున్నారు. శ్రీ కన్యకాపరమేశ్వరీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ మహిళా కళాశాల(ఎస్‌కేపీసీ), కళాలయా ఫైన్‌ ఆర్ట్స్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో స్నిగ్ధా –2023 పేరుతో కల్చరల్‌ ఫెస్ట్‌ను రెండు రోజులు పాటు ఏర్పాటు చేశారు.
 Talented students
ప్రతిభ చాటిన విద్యార్థినులు

తొలిరోజైన గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆఫ్‌ స్టేజ్‌ ఈవెంట్‌గా వెజిటెబుల్‌ కార్వింగ్‌, క్రియేటివ్‌ ఐడియాస్‌, ఫేస్‌ పెయింటింగ్‌, మొబైల్‌ కేస్‌ డిజైనింగ్‌ పోటీలు నిర్వహించారు. న్యాయనిర్ణేతలుగా వి. శాంతి, షాలిని, వి.సెంథిల్‌, లలిత వ్యవహరించారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థినులకు కళాశాల కరస్పాండెంట్‌ శరత్‌కుమార్‌, ప్రిన్సిపల్‌ మోహనశ్రీ బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు .

Published date : 28 Jul 2023 03:55PM

Photo Stories