Skip to main content

Sankalp 2025: ఇంటర్‌ విద్యార్థులకు ‘సంకల్ప్‌–2025’

Inter students
Inter students

అజిత్‌సింగ్‌నగర్‌(విజయవాడసెంట్రల్‌): ఇంటర్‌ విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో ఇంటర్మీడియెట్‌ కమిషనర్‌ కృతిక శుక్లా ఇచ్చిన ఉత్తర్వులు మేరకూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ కళాశాలల్లో ‘సంకల్ప్‌–2025’ కార్యక్రమాన్ని ప్రారంభించామని ఎన్టీఆర్‌ డీఐఈఓ సి.ఎస్‌.ఎస్‌.ఎన్‌.రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Inter అర్హతతో కొత్తగా 8వేల VRO ఉద్యోగాలు: Click Here

ఈ ప్రణాళిక ప్రకారం రోజూ మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 5.15 గంటల వరకూ నిర్దిష్ట ప్రశ్నలతో ఆయా అధ్యాపకుల స్వయం పర్యవేక్షణలో విద్యార్థులకు చదివిస్తారని పేర్కొన్నారు. విద్యార్థుల సామర్థ్యాలను బట్టి ఏ,బీ,సీ కేటగిరిగా విభజించి, వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిత్యం వారితో చదివించడం, జవాబులు రాయించడం, వారి అనుమానాలను నివృత్తి చేయడం చేస్తామని వివరించారు.

Published date : 05 Dec 2024 10:02AM

Photo Stories