Skip to main content

AP Schools: నాడు–నేడు అభివృద్ధి పనుల పరిశీలన: కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌

పాలకొండ రూరల్‌: బడిఈడు పిల్లలందరూ బడిలోనే ఉండాలని కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌ స్పష్టం చేశారు. పాలకొండ పెద్దకాపు వీధిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను బుధవారం సందర్శించారు. బడి బయట ఉన్న ఐదుగురు పిల్లలకు పాఠశాలలో ప్రవేశాలు కల్పించారు. వారి వివరాలను స్వయంగా కంప్యూటర్‌లో నమోదుచేశారు.

జిల్లాలో జీఈఆర్‌ (గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రోల్‌) శతశాతం ఉండేలా చూడాలని డీఈఓ ఎన్‌.ప్రేమ్‌కుమార్‌కు కలెక్టర్‌ సూచించారు. ఇప్పటికే ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా పాలకొండ పరిసరాల్లో 176 మందిని గుర్తించామని, వీరిలో ఇతర ప్రాంతాలకు తల్లిదండ్రులతో వలసవెళ్లిన పిల్లల విషయంతో ప్రత్యేకశ్రద్ధ వహిస్తున్నామని ఎన్‌రోల్‌ మెంట్‌ అధికారి ఆర్‌.విజయ్‌కుమార్‌ కలెక్టర్‌కు తెలిపారు.

Also read: AP OPEN SCHOOL: దరఖాస్తుల ఆహ్వానం...చివరి తేదీ ఇదే..

విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, అమ్మఒడి, నాడు–నేడు, విద్యాకిట్లు తదితర పథకాలను పిల్లలు, వారి తల్లిదండ్రులు అందిపుచ్చుకోవాలని కలెక్టర్‌ కోరారు. వారంరోజుల్లోగా బడి బయట పిల్లలను ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా బడుల్లో చేర్పించాలని సూచించారు. నాడు–నేడు రెండవ విడతలో మంజూరైన రూ.17లక్షల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆయన వెంట ఎంఈఓలు పి.కృష్ణమూర్తి, సీహెచ్‌ సోంబాబు, డీటీ బి.బుచ్చయ్య, హెచ్‌ఎం సీహెచ్‌.సోమేశ్వరరావు ఉన్నారు.

Also read: Jagananna Vidya Kanuka: నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి..

Published date : 27 Jul 2023 03:35PM

Photo Stories