Jagananna Vidya Kanuka: నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి..
స్కూళ్ల నిర్వహణలో నాయకత్వ లక్షణాలపై ప్రధానోపాధ్యాయులకు అనంతపురం శివారులోని టీటీడీసీ కేంద్రంలో ఏర్పాటు చేసిన రెండో విడత శిక్షణ కార్యక్రమాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఏర్పాట్లు, మౌలిక సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం శిక్షణలో పాల్గొన్న ప్రధానోపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. పునాది అభ్యసన, గణిత పరిజ్ఞానం, మౌలిక సదుపాయాల కల్పన, పాఠశాల వ్యవస్థను సక్రమంగా నడిపేలా ప్రధానోపాధ్యాయుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ఆరు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Also read: Free Training: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ.. #sakshieducation
విద్యార్థులందరికీ జగనన్న విద్యా కానుక కిట్లు అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ సాయిరామ్, పెనుగొండ ఉపవిద్యాశాఖ అధికారి రంగస్వామి, రాష్ట్ర పరిశీలకులు పెంచలయ్య, అన్నపూర్ణమ్మ పాల్గొన్నారు.
Also read: AP OPEN SCHOOL: దరఖాస్తుల ఆహ్వానం...చివరి తేదీ ఇదే..