Skip to main content

National Education Policy: అత్యంత ఆధునిక సౌకర్యాలతో వర్చువల్ ఓపెన్ స్కూల్‌ ప్రారంభం

నూతన విద్యా విధానం భారతదేశాన్ని ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా రూపుదిద్దుతుంది.. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ మంజునాథ్
జాతీయ విద్యా విధానం -2020
జాతీయ విద్యా విధానం -2020

అత్యంత ఆధునిక సౌకర్యాలతో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ లో వర్చువల్ ఓపెన్ స్కూల్‌ ప్రారంభం... . ఎన్ఐఓఎస్ ప్రాంతీయ డైరెక్టర్ శ్రీ నిక సాంకేతికతలను ఉపయోగించి బ్లెండెడ్ లెర్నింగ్‌తో సాధికారత కలిగిన ను ప్రారంభించింది- అనిల్ కుమార్

Also read: AI in School Education: CM Jagan Reviews Future Technology Skills #sakshieducation

దేశ సంస్కృతిని పరిరక్షించే విధంగా 5 విధానాలతో జాతీయ విద్యా విధానం-2020 కింద విద్యా బోధన జరుగుతున్నదని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ డి.మంజునాథ్ తెలిపారు. విద్యా విధానం అమలులోకి వచ్చి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లోని పికెట్‌లోని కెవి స్కూల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీ మంజునాథ్ మాట్లాడారు. దేశంలో అన్ని వర్గాలకు చెందిన వారికి నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో ఎన్‌ఇపి-2020ని 2020 జూలై 29న కేంద్రం అమల్లోకి తెచ్చిందన్నారు. 

nes 2023

Also read: CM Jagan Good News: జగనన్న విదేశీ విద్యా దీవెన నిధుల విడుదల #sakshieducation

“ ఎన్‌ఇపి వల్ల దేశ విద్యా వ్యవస్థలో భారీ మార్పులు వస్తాయి. భారతదేశాన్ని ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా రూపుదిద్దడానికి ఎన్‌ఇపి అవకాశం కలిగిస్తుంది. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు అన్ని స్థాయిలలో సంస్కరణలు అమలు జరపడానికి విద్యా విధానం వీలు కల్పిస్తుంది" అని ఆయన తెలిపారు. . "పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన వృత్తి విద్య లో శిక్షణ ఇవ్వడానికి జాతీయ విద్యా విధానం ద్వారా కృషి జరుగుతుంది. ఉపాధ్యాయులను జవాబుదారీగా చేస్తుంది. దీనివల్ల వృత్తి విద్యా ప్రమాణాలు పెరుగుతాయి" అని డాక్టర్ మంజునాథ్ తెలిపారు.

Also read: Teacher Education System: మా‘స్టార్లు’గా మార్చేందుకు..

కెవి సంఘటన్ అమలు చేస్తున్న కార్యక్రమాల వివరాలను డాక్టర్ మంజునాథ్ వివరించారు. దీనిలో భాగంగా విద్యా మంత్రిత్వ శాఖ విద్యాంజలి కార్యక్రమం అమలు చేస్తున్నదని అన్నారు. దేశవ్యాప్తంగా పాఠశాలల్లో సామాజిక, ప్రైవేటు రంగం సహకారంతో పాఠశాలలను బలోపేతం చేయడానికి కార్యక్రమం అమలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ, వాలంటీర్లు తమకు నచ్చిన పాఠశాలను ఎంపిక చేసుకుని వారి విజ్ఞానం, నైపుణ్యాలను పంచుకుంటారని ఆయన వివరించారు.

Also read: CM Jagan Good News: Benefits for AP MBBS Aspirants | 100% Seats #sakshieducation

ఆస్తులు/వస్తువు/పరికరాల రూపంలో తమ వంతు సహకారం అందిస్తారని ఆయన చెప్పారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమగ్ర పురోగతి కోసం 'నిష్ఠ' కార్యక్రమాన్ని విద్యా మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న సమగ్ర శిక్ష కార్యక్రమంలో భాగంగా అమలు చేస్తున్నామని డాక్టర్ మంజునాథ్ తెలిపారు.జాతీయ విద్యా విధానం కింద ఈ కార్యక్రమం అమలు జరుగుతుందన్నారు.  

Also read: AP Third Place in Training & Employment to Rural Youth @SakshiBhavita

ఎన్ఐఓఎస్ ప్రాంతీయ డైరెక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం -2020 అమలు చేయడానికి ఎన్ఐఓఎస్ అమలు చేస్తున్న కార్యక్రమాలు వివరించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన అభ్యాసకులకు అవసరమైన ప్రత్యేకమైనసౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తున్నామన్నారు. సాంకేతికతను ఉపయోగించి బధిర అభ్యాసకులకు సంకేత భాషలో అభ్యాస వనరులను అందుబాటులోకి తేవడానికి ప్రణాళిక రూపొందించామని ఆయన చెప్పారు. సంకేత భాషలో మొత్తం 906 వీడియోలు అభివృద్ధి చేశామన్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ (ఎన్ఐఓఎస్ ) అత్యాధునిక సాంకేతికత వినియోగించి బ్లెండెడ్ లెర్నింగ్ ద్వారా వర్చువల్ ఓపెన్ స్కూల్‌ను ప్రారంభించింది. వర్చువల్ ఓపెన్ స్కూల్ కోసం నమోదు చేసుకోవడానికి ఇష్టపడే అభ్యాసకులు ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించుకోవచ్చని ఆయన కోరారు. 

Also read: Jagananna Videshi Vidya Deevena: విదేశీ విద్యకు ఊతం @ 100% fee reimbursement

జాతీయ విద్యా విధానం -2020ని అమలు చేయడంలో తమ సంస్థలు తీసుకుంటున్న కార్యక్రమాలను ఇగ్నో ప్రాంతీయ డైరెక్టర్ I డాక్టర్ రమేష్, సీబీఎస్ఈ నగర కమిషనర్ సునీతా రావు వివరించారు. . 'మూడేళ్ల జాతీయ విద్యా విధానం-2020' అనే అంశంపై కేవీ పికెట్ పాఠశాల రూపొందించిన విభిన్న ప్రాజెక్టులను ప్రదర్శించారు. కార్యక్రమంలో కేవీ పికెట్, కేవీ బేగంపేట ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Also read: TS OPEN SCHOOL: దరఖాస్తుల ఆహ్వానం... చివరి తేదీ ఇదే..

Published date : 28 Jul 2023 06:25PM

Photo Stories