TS OPEN SCHOOL: దరఖాస్తుల ఆహ్వానం... చివరి తేదీ ఇదే..
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: చదువుకోవాలని కోరిక ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితులు, పేదరికం కారణంగా అనేక మంది విద్యార్థులు చదువుకు దూరమవుతుంటారు. ఈ క్రమంలో చదువు మధ్యలో వదిలేసిన యువతీ, యువకులకు చదువుకునేందుకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం ఓపెన్ స్కూల్ విధానాన్ని తీసుకువచ్చింది. దీంతో ఎస్సెస్సీ పూర్తి కాకుండా 14 సంవత్సరాలు నిండి, చదవడం, రాయడం వస్తే చాలు అడ్మిషన్ ఇస్తారు. పదో తరగతి పరీక్ష రాయవచ్చు. ఇంటర్‌లో చేరడానికి 16ఏళ్లు నిండి ఉండాలి. ఆగస్టు 10వ తేదీ వరకు విద్యార్థులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. చేరిన విద్యార్థులకు ప్రభుత్వం పుస్తకాలు, స్టడీ మెటీరియల్ అందజేస్తుంది. స్థానికంగా ఉండే హైస్కూల్‌లో అడ్మిషన్ పొందే వెసులుబాటు ఉంది. గత సంవత్సరం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 57 స్టడీసెంటర్‌లలో ఎస్సెస్సీలో 2,971 మంది, ఇంటర్‌లో 3,214 మంది అడ్మిషన్లు పొందారు.
ఏ ఉద్యోగానికై నా దరఖాస్తు చేయవచ్చు..
ఓపెన్ స్కూల్‌ద్వారా విద్యార్థులు ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ అందిస్తారు. వీరిని నేరుగా పాఠశాలకు వెళ్లి రెగ్యులర్‌గా చదివిన వారితో సమానంగా పరిగణిస్తారు. ఓపెన్ డిగ్రీ చేసేందుకు అంబేద్కర్, రాంరెడ్డి తదితర యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్‌లు ఇస్తున్నాయి. కానీ ఓపెన్ పద్ధతిలో ఎస్సెస్సీ ఇంటర్ సర్టిఫికెట్‌లు ఇచ్చే ఏకై క ప్రభుత్వ సంస్థ ఓపెన్ స్కూల్. ఇక్కడ చదువు పూర్తయ్యాక విద్యార్థులు ఎస్సెస్సీ ఫాస్ అయితే రెగ్యులర్, ఓపెన్ ఇంటర్ చేయవచ్చు. ఎస్సెస్సీకి సమానమైన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఇంటర్మీడియట్ పూర్తయ్యాక ఒక్క ఐఐటీ, నీట్ పరీక్ష తప్ప అన్నిడిగ్రీలు చేసుకునేందుకు అవకాశం ఉంది.
ఉమ్మడి జిల్లాలో 57 స్టడీ సెంటర్‌లు..
దరఖాస్తు చేసుకున్న తర్వాత రోజువారి పనులకు ఇబ్బంది కలుగకుండా స్థానికంగానే తరగతులు సైతం వినేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 60 స్టడీ సెంటర్‌లను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ బాధ్యతలు పూర్తిగా పలుహైస్కూల్ హెచ్‌ఎంలకు బాధ్యతలు అప్పగించారు. ఇందులో విద్యార్థులు ఎస్సెస్సీ, ఇంటర్ వారికి ప్రతి ఆదివారం తరగతులు నిర్వహిస్తారు. వివిధ పనులు చేసుకునే వారు ఈ తరగతులకు హాజరై పాఠాలు వినే అవకాశం ఉంది. మొత్తం 30 తరగతుల్లో 24 తరగతులకు హాజరైన వారికి పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. ఇంటర్‌లో సైన్స్ గ్రూపులు తీసుకున్న వారికి 48 ప్రాక్టికల్స్ తరగతులకు కూడా హాజరుకావాల్సి ఉంటుంది. అన్నిగ్రూపుల వారు తప్పకుండా అసైన్‌మెంట్ రాయాల్సి ఉంటుంది.
జిల్లా పేరు ఎస్సెస్సీ విద్యార్తులు ఇంటర్ విద్యార్తులు
స్టడీసెంటర్‌లు స్టడీసెంటర్‌లు
మహబూబ్‌నగర్ 13 819 14 880
నారాయణపేట్ 11 631 9 595
నాగర్‌కర్నూల్ 13 569 12 572
వనపర్తి 10 404 9 456
గద్వాల్ 12 548 13 711
మొత్తం 57 2,971 57 3,214
రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ మధ్యలో స్కూల్ మానేసిన వారికి మళ్లీ చదువుకునే అవకాశం అడ్మిషన్లు పెంచేందుకు అధికారుల ప్రత్యేక డ్రైవ్ ఆగస్టు 10 వరకు చేరేందుకు అవకాశం అవకాశాన్ని అందుకోవాలి..
ఓపెన్ స్కూల్‌ను పూర్తి స్థాయిలో వినియోగించుకొనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పని చేసుకునే సమయాల్లో కాకుండా ఆదివారాల్లో తరగతులు వినేందుకు అవకాశం ఉంది. విద్యార్థులు దీన్ని వినియోగించుకుని పైచదువులకు వెళ్లాలి.
– రాంశుభాస్‌గౌడ్, ఓపెన్‌స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్