Jagananna Videshi Vidya Deevena: విదేశీ విద్యకు ఊతం @ 100% fee reimbursement
● నేడు జగనన్న విదేశీ విద్యాదీవెన కార్యక్రమం ● జిల్లాలో 13 మంది విద్యార్థులకు లబ్ధి ● కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి కార్యక్రమం
వరల్డ్ క్యూఎస్ ర్యాంకింగ్, టైమ్స్ ర్యాంకుల ప్రకారం ఇంజినీరింగ్, మెడిసిన్, లా, జర్నలిజం తదితర కోర్సులు చదివేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు, ఇతర విద్యార్థులకు రూ.కోటి వరకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, విమాన ప్రయాణం, వీసా ఖర్చులతో సహా ప్రభుత్వం అందజేస్తోంది. ఈ పథకం ద్వారా ప్రపంచంలోని 320కి పైగా ఉత్తమ కళాశాలల్లో ఉచితంగా చదువుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది.
Also read: Scholarships: విదేశీ విద్యాదీవెనకు 357 మంది ఎంపిక
జిల్లాలో 13 మందికి లబ్ధి
జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం ద్వారా జిల్లా లోని 13 మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తోంది. 2022–23 సంవత్సరంలో 11 మందికి, 2023–24లో ఇద్దరికి మొత్తం 13 మందికి లబ్ధి కలుగుతోంది. గత విద్యాసంవత్సరంలో 11 మంది విదేశాలకు వెళ్లారు. ప్రస్తుతం ఇద్దరు విదేశాలకు వెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం రూ.2,19,82,841 నగదును ప్రభుత్వం ఈ నెల 27 వ తేదీన సంబంధిత అభ్యర్థుల ఖాతాలకు జమ చేయనుంది.
Also read: AP Schools: నాడు–నేడు అభివృద్ధి పనుల పరిశీలన: కలెక్టర్ నిషాంత్‌కుమార్
నేడు కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి కార్యక్రమం
జగనన్న విదేశీ విద్యాదీవెన (మొదటి విడత) కార్యక్రమం గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించను న్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి కార్యక్రమం నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీచైర్మన్, ఇతర ప్రజాప్రతినిధులు జిల్లా స్థాయి కార్యక్రమానికి విచ్చేయాలని జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారులు ఆహ్వానం పంపారు.
Also read: AP schools: పాఠశాలల్లో జాగ్రత్తలు తీసుకోవాలి
పేదల కల సాకారం
విదేశాల్లో ఉన్నత వి ద్యనభ్యసించాలనుకు నే పేద విద్యార్థుల క లను ప్రభుత్వం సా కారం చేస్తోంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా విదేశాల్లో విద్యనభ్యసించలేని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం ద్వారా మేలు చేస్తోంది. పేద విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా 320కి పైగా ఉత్తమ కళాశాలల్లో చదువుకునేందుకు ప్ర భుత్వం అవకాశం కల్పిస్తోంది. ఈ నెల 27వ తేదీన నిర్వహించే కార్యక్రమంలో రూ.2,19,82,841 నగదు లబ్ధిదారులకు ప్రభుత్వం అందివ్వనుంది.
– షణ్మోహన్, కలెక్టర్