Admissions: ‘IGNOU’ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో)లో జూలై–2024 నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తు న్నట్లు ఇగ్నో విజయవాడ ప్రాంతీయ కేంద్రం సీనియర్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ డీఆర్ శర్మ తెలిపారు.
పోస్టు గ్రాడ్యుయేషన్, డిగ్రీ, డిగ్రీ ఆనర్స్, పీజీ డిప్లొమో, డిప్లొమో, సర్టిఫికెట్ కోర్సులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం జూన్ 30 ఆఖరు తేదీగా ప్రకటించినట్లు తెలిపారు. పీజీ రెండో సంవత్సరం, డిగ్రీ రెండు, మూడు సంవత్సరాలు, సెమిస్టర్ విధానంలో చదివే విద్యార్థులు రిజిస్ట్రేషన్ ఫీజులను ఆన్‌లైన్ ద్వారా జూన్ 30 లోపు చెల్లించాలని సూచించారు.
చదవండి: Distance Education: దూర విద్యలో ఇగ్నో ఆధునిక కోర్సులు.. దేశ వ్యాప్తంగా స్థానం ఇది!
వివరాలకు ఇగ్నో వెబ్‌సైట్‌ను గాని లేదా విజయవాడ కొత్తపేట లోని హిందూ హైస్కూల్ ప్రాంగణంలో ఉన్న ఇగ్నో ప్రాంతీయ కేంద్రాన్ని స్వయంగా గాని లేదా 0866–2565253 నంబర్‌లో సంప్రదించాలి.
Published date : 16 May 2024 12:37PM