BRAOU Admissions: అంబేడ్కర్ వర్సిటీ ప్రవేశాలకు నోటిఫికేషన్.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..
Sakshi Education
బంజారాహిల్స్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వ త్రిక విశ్వవిద్యాలయం, అపోలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్కేర్ మేనేజ్మెంట్, కృష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, దారుసలాం ఎడ్యుకేష నల్ ట్రస్ట్ సంయుక్తంగా ఎంబీఏ (హాస్పిటల్ అండ్ హెల్త్కేర్ మేనేజ్మెంట్)లో ప్రవేశం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ మేరకు విశ్వవిద్యాలయ వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పోస్టర్ ఆవిష్కరిం చారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని, మార్చిలో హైదరాబాద్లో అర్హత పరీక్ష నిర్వహిస్తారని పేర్కొన్నారు.
మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయ పోర్టల్ గానీ, వెబ్సైట్ గానీ, 040-23680441/45 నెం బర్లలోగానీ సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో యూనివర్సిటీ అకాడమిక్ డైరె క్టర్ పుష్పాచక్రపాణి, మేనేజ్మెంట్ విభాగం డీన్ ఆనంద్ పవార్, రిజిస్ట్రార్ ఎల్వీ కే రెడ్డి, అపోలో హాస్పిటల్ అధికారిణి విజయరుద్రరా జు, కిమ్స్ కాలేజీ ప్రిన్సిపాల్ రవికుమార్, యూనివర్సిటీ అధికారులు రబీంద్రనాథ్ సోలమన్, పల్లవీ కాబ్దే, కిరణ్మయి, డాక్టర్ వెం కటేశ్వర్లు, భోజు శ్రీనివాస్, రాధాకృష్ణ తదిత రులు పాల్గొన్నారు.
![]() ![]() |
![]() ![]() |
Published date : 17 Jan 2025 03:26PM
Tags
- MBA Notification
- Dr BR Ambedkar Open University
- BRAOU
- Apollo Institute of Healthcare Management
- Krishna Institute of Medical Sciences
- Darussalam Education National Trust
- Hospital and Healthcare Management
- Professor Ghanta Chakrapani
- BRAOU Hyderabad MBA Courses
- Notification for ambedkar university mba admissions
- Notification for ambedkar university mba admissions 2025
- ambedkar open university pg courses list
- MBA Admissions
- ApolloHealthcareManagement
- HealthcareEducation
- MBANotification