Open Degree Exams: ఓపెన్ వర్సిటీ బ్యాక్‌లాగ్ విద్యార్థులకు అవకాశం

బీఏ, బీకాం , బీఎస్సీ కోర్సుల్లో చేరి ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరపు పరీక్షలు రాయని విద్యార్థులు ఈ అవకాశాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. రీ అడ్మిషన్ పొందడానికి, బ్యాగ్ గ్ పరీక్షలు రాయడానికి డిసెంబర్ 31 వరకు ఆన్‌లైన్‌లో ఫీజులు చెల్లించవచ్చని తెలిపారు. వచ్చే జనవరి 28 నుంచి ఫిబ్రవరి 2 వరకు తృతీయ సంవత్సరం విద్యార్థులకు, ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని ఆయన చెప్పారు. అలాగే జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మొదటి సంవత్సరం పరీక్షలు ఉంటాయని తెలిపారు.
చదవండి: NLC Jobs: 10వ తరగతి అర్హతతో ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు.. నెలకు రూ.38,000 జీతం..
తృతీయ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు, మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొ న్నారు. ఈ సదవకాశాన్ని బ్యాక్‌లాగ్ విద్యార్థులు వినియోగించుకుని తమ కోర్సులను విజయవంతంగా పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు. ఇతర వివరాలకు బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అధ్యయన కేంద్రంలో గానీ, 98854 94588 ఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చన్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Tags
- Open university is an opportunity for backlogged students
- Dr BR Ambedkar Open University
- Begumpet Government Degree College for Women
- Maroju Ramachary
- Open university
- Degree Students
- Backlogged Students
- BA
- Bcom
- BSC
- Re Admission
- Open Degree Backlogged Exams
- Telangana News
- Begumpet Government Women's Degree College
- Open University courses