Skip to main content

MBA Admissions: హెచ్‌సీయూలో ఎంబీఏ సీటుకు చివరి అవకాశం.. చివ‌రి తేది ఇదే..

రాయదుర్గం: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎంబీఏ కోర్సు (2025–27)లో సీటు కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి అవకాశం కల్పిస్తున్నారు.
Last chance for MBA seat in HCU  Hyderabad Central University MBA 2025-27 last chance to apply  Last date for MBA application at Hyderabad Central University

క్యాట్‌–2024లో సాధించిన స్కోరు, గ్రాడ్యుయేషన్‌లో 60 శాతం పైగా మార్కుల ద్వారా ప్రవేశం కల్పిస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 31 చివరి తేదీ. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్‌ ఫైనల్‌ ఇయర్‌ చదివే విద్యార్థులకు కూడా దరఖాస్తుకు అవకాశం కల్పిస్తున్నారు.

చదవండి: BRAOU Admissions: అంబేడ్కర్ వర్సిటీ ప్రవేశాలకు నోటిఫికేషన్.. దరఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

ఎంబీఏ అడ్మిషన్‌ నోటిఫికేషన్, ప్రాస్పెక్టస్, ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ లింకు, మరిన్ని వివరాలకు హెచ్‌సీయూ వెబ్‌సైట్‌ http://acad.uohyd.ac.in/mba25.htmlను సందర్శించాలి. ఇప్పటివరకు ఈ కోర్సు పూర్తి చేసినవారు టీసీఎస్, డిలాయిట్, సింక్రోని, డాక్టర్‌ రెడ్డిస్‌ ల్యాబ్స్, హిటాచీ, ఫెడరల్‌ బ్యాంకు వంటి సంస్థలలో ఉద్యోగ అవకాశాలు పొందారని, అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  
 

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 22 Jan 2025 08:55AM

Photo Stories