Good News for Open University Students: ఓపెన్ వర్సిటీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం జనవరి 26న విడుదల చేసిన పద్మ అవార్డులపై ప్రభుత్వం అసంతృప్తిగా ఉందని, తాము పంపిన పేర్లను కేంద్రం పరిగణలోకి తీసుకోకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
యూనివర్సిటీల్లో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అవసరమైన చర్యలు చేపట్టాలని వీసీలను ఆదేశించామని అన్నారు. అలాగే సీనియర్ ప్రొఫెసర్ల సేవలను ఉపయోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రోఫెస్సర్ల పదవీ విరమణ వయస్సును 65 సంవత్సరాలకు పెంచే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ఆయా వర్గాల్లో నిష్ణాతులను వీసీలుగా నియమించామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు అమలు అవుతున్న మాదిరిగానే అంబేద్కర్ విశ్వవిద్యాయం లో అభ్యసించే విద్యార్థులకూ ఫీజు రీయింబర్స్‌మెంట్ కార్యక్రమాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
చదవండి: High Court: ఘంటా చక్రపాణిని వైస్ చాన్స్‌లర్‌గా ఎలా నియమించారు?
సీఎం గ్రాడ్యుయేశన్ స్కీం కింద లక్ష మంది దళిత, పేద విద్యార్ధులను ఉన్నత విద్యా వంతులుగా తీర్చిదిద్దే కార్యక్రమ అమలు అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు. గత 10 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థను రాష్ట్రంలో నిర్వీర్యం చేశారని రానున్న రోజుల్లో కార్పొరేట్ విద్యా సంస్థల నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్లనున్నట్లు వెల్లడించారు.

అంబేద్కర్ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఘంటా చక్రపాణి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఆచార్య. చక్రపాణి మాట్లాడుతూ అంబేద్కర్ వర్శీటీ లో చివరగా కోట్ల విజయ భాస్కర్ రెడ్డి సీఎం హోదాలో చివరగా అడుగు పెడితే తిరిగి 30 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం హోదాలో తమ యూనివర్సిటీ లో అడుగు పెట్టారని ఇది తమకు శుభ సూచకమన్నారు.
![]() ![]() |
![]() ![]() |
రాష్ట్రంలోని ఏ యూనివర్సిటీ కి తక్కువ కాకుండా అన్ని కోర్సులు అంబేద్కర్ వర్సిటీలో అందిస్తున్నామని, ఇటీవలే పీఎం – ఉషా నిధుల కింద యూజీసీ నుంచి 20 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని అందులో భాగంగా దాదాపు రూ. 10 కోట్ల నిధులతో ఏర్పాటు చేయబోతున్న డిజిటల్ రీసోర్స్ సెంటర్ కు ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నామని, ఈ సెంటర్ ద్వారా భవిష్యత్తులో అంబేద్కర్ విశ్వవిద్యాలయం పాఠ్యాంశాలను, బోధనను, ఇతర విద్యార్థి సేవలను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతుల ద్వారా డిజిటల్ కంటెంట్ రూపంలో అందజేయడానికి వీలవుతుందని వివరించారు.
సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ సెంటర్ దాదాపు రూ. 3 కోట్ల వ్యయంతో కొత్త ప్రయోగశాలల (laboratory)లను నిర్మించనున్నట్లు, దీనికిగాను యూజీసీ పీఎం ఉషా స్కీం కింద ఆర్థిక సాయం అందజేస్తుందని వెల్లడించారు.
Tags
- Education Fee reimbursement
- Fee Reimbursement for Open University Students
- Reimbursement of Tuition fee to students
- Scholarships and Financial Assistance
- Fee reimbursement for Open University students
- Education Fee Reimbursement Scheme
- Education fee reimbursement scheme
- BRAOU
- Dr.B.R. Ambedkar Open University
- cm revanth reddy
- BRAOU Online