Skip to main content

CA Jobs: సీఏ కోర్సు పూర్తి చేసి కార్పొరేట్‌ ఉద్యోగాలు పొందండి ఇలా!

చార్టర్డ్‌ అకౌంటెన్సీ (CA) – ఇది కామర్స్‌ విద్యార్థులకు అత్యంత విలువైన ప్రొఫెషనల్ కోర్సు. ఈ కోర్సు ద్వారా ప్రతిష్టాత్మక కార్పొరేట్ ఉద్యోగాలు, ట్యాక్స్ కన్సల్టెన్సీ, ఆడిట్ కంపెనీల్లో ఉద్యోగాలు, అలాగే స్వతంత్రంగా ప్రాక్టీస్ చేసే అవకాశాలు లభిస్తాయి. CA పూర్తి చేసిన తర్వాత లే-ఆఫ్‌లు, పింక్‌స్లిప్‌లు వంటి రిస్కులు తక్కువగా ఉంటాయి.
Complete your CA course and get corporate jobs  Chartered Accountancy course for commerce students  Career opportunities after CA

సీఏ కోర్సు ముఖ్యమైన దశలు:

ఫౌండేషన్‌ కోర్సు (CA Foundation)

  • ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.
  • ఏడాదికి మూడుసార్లు (జనవరి, మే, సెప్టెంబర్‌) పరీక్షలు.
  • నాలుగు పేపర్లు: అకౌంటింగ్‌, బిజినెస్ లాస్‌, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌, బిజినెస్ ఎకనామిక్స్‌.
  • 400 మార్కులకు పరీక్ష, కనీసం 200 మార్కులు సాధించాలి.

ఇంటర్మీడియెట్‌ కోర్సు (CA Intermediate)

  • ఫౌండేషన్, డిగ్రీ, CMA లేదా CS ఇంటర్‌ ఉత్తీర్ణులు అర్హులు.
  • రెండు గ్రూప్‌లలో ఆరు పేపర్లు (600 మార్కులు).
  • ఐసీఐటీఎస్‌ఎస్‌ శిక్షణ, 8 నెలల ప్రాక్టికల్ ట్రైనింగ్‌ అవసరం.
  • గ్రూప్‌–1: అడ్వాన్స్‌డ్‌ అకౌంటింగ్‌, లాస్‌, ట్యాక్సేషన్‌.
  • గ్రూప్‌–2: కాస్టింగ్‌, ఆడిటింగ్‌, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌, స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్‌.

చదవండి: ఈ కోర్సులు చేసిన వారికి ఉద్యోగాలు కల్పించేలా.. 80 దేశాలతో ఈ సంస్థల ఒప్పందాలు..

ఫైనల్‌ కోర్సు (CA Final)

  • ఇంటర్ పూర్తయిన తర్వాత 2 ఏళ్ల ఆర్టికల్‌షిప్‌ అవసరం.
  • అడ్వాన్స్‌డ్‌ ఐటీ, 4 సెల్ఫ్‌ పేస్డ్‌ మాడ్యూల్స్‌ తప్పనిసరి.
  • రెండు గ్రూప్‌లలో ఆరు పేపర్లు (600 మార్కులు).
  • ఎలక్టివ్ పేపర్ (పేపర్‌–6) ఓపెన్ బుక్ ఫార్మాట్‌లో ఉంటుంది.

CA పూర్తి చేసిన తర్వాత ఉపాధి అవకాశాలు:

  • బ్యాంకులు, ఎంటర్‌ప్రైజ్‌లు, బిగ్ 4 కంపెనీలు ఉద్యోగ అవకాశాలు.
  • ఫైనాన్షియల్ కన్సల్టెంట్, ట్యాక్స్ అడ్వైజర్, లీగల్ ఎక్స్‌పర్ట్‌గా విస్తృత అవకాశాలు.
  • ప్రభుత్వ రంగ PSU ల్లో కూడా మంచి అవకాశాలు.
Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 22 Apr 2025 09:42AM

Photo Stories