HCUకు అంతర్జాతీయ ర్యాంకు
Sakshi Education
రాయదుర్గం: కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థ అయిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హెచ్‌సీయూ) అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
అంతర్జాతీయ విద్యార్థుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్–12 శాతం విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా హెచ్‌సీయూ నిలిచింది. స్టడీ అబ్రాడ్ ఎయిడీ (ఎస్‌ఏఏ) అనే సంస్థ ఈ మేరకు 2024కుగాను ప్రకటించిన ర్యాంకుల్లో చోటు సంపాదించింది.
చదవండి: Akhil Kumar: హెచ్‌సీయూ విద్యార్థికి రాజనీతిశాస్త్రంలో డాక్టరేట్
యూనివర్సిటీ రకం, ఫీజులు, అందిస్తున్న కోర్సులు, అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య తదితర వివరాల ఆధారంగా ఎస్‌ఏఏ ఈ ర్యాంకులు ప్రకటించింది. కాగా, తమ విద్యాసంస్థ ఈ ర్యాంకు సాధించడంపై వర్సిటీ వీసీ ప్రొఫెసర్ బీజే రావు హర్షం వ్యక్తం చేశారు.
Published date : 29 May 2024 03:54PM